ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 అనేది ఓపెన్ సీక్రెట్. సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా ట్వీట్లు పెడుతూ అభిమానులకు అప్డేట్స్ లేని లోటు తీరుస్తున్నాడు. రేపో ఎల్లుండో అఫీషియల్ రిలీజ్ డేట్ తో పాటు సెకండ్ సింగల్ తాలూకు సమాచారం ఇస్తారు. నిజానికి రిలీజ్ డేట్ కు సంబంధించి దర్శకుడు శంకర్ నుంచి ఖచ్చితమైన నిర్ధారణ రాలేదట. పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుందామని తొలుత నిర్మాత దిల్ రాజుతో చెప్పినట్టు టాక్ ఉంది.
కానీ టార్గెట్ పెట్టుకుని పని చేస్తే తప్ప డెడ్ లైన్ అందుకోలేమని భావించిన రామ్ చరణ్ దానికి మాత్రం ససేమిరా అన్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 20 కాకుండా వేరే ఆప్షన్ పెట్టుకోవద్దని తేల్చి చెప్పేశాడట. పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ ఉన్న విషయాన్ని కొందరు ప్రస్తావిస్తే ఏం పర్లేదని, బాగుంటే ఆడియన్స్ రెండూ చూస్తారని అన్నట్టు సమాచారం. అసలే ఆన్ లైన్ లో బన్నీ మీద కాసింత గుర్రుగా ఉన్న మెగా ఫాన్స్ క్లాష్ నే కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే చరణ్, బన్నీలు కేవలం పధ్నాలుగు రోజుల నిడివిలో తలపడటం ఆసక్తి రేపుతోంది.
ఇకపై ప్రమోషన్లను నాన్ స్టాప్ గా చేయబోతున్నారు. దేవర హడావిడి వచ్చే వారం నుంచి తగ్గిపోతుంది కాబట్టి ఇకపై క్రమం తప్పకుండా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఏదో ఒక కంటెంట్ ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల మినహాయిస్తే కేవలం 80 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ప్రమోషన్లకు ప్రత్యేకమైన ప్లాన్ కావాలి. శంకర్ నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఆ బాధ్యతని రామ్ చరణ్ బృందం తీసుకుంటుందని వినికిడి. విపరీతమైన ఆలస్యం వల్ల బజ్ తగ్గిందని ఫీలవుతున్న అభిమానుల ఆకలి తీరేలా గేమ్ ఛేంజర్ టీమ్ భారీ స్ట్రాటజీలు సిద్ధం చేసిందట. చూద్దాం.
This post was last modified on September 24, 2024 6:38 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…