Movie News

మాస్ స్పెల్లింగ్ రాయిస్తున్న దేవర

ఒక స్టార్ సోలో హీరోగా సుదీర్ఘ విరామం తీసుకుంటే ఎలా ఉంటుందో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ చూపిస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి అరాచకం ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇప్పటిదాకా సుమారుగా 400 పైగా బెనిఫిట్ షోలు అమ్మకానికి పెట్టగా దాదాపుగా అన్నీ సోల్డవుట్ అయ్యాయి. ఇంకా మూడు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ కౌంట్ ఎక్కడిదాకా వెళ్తుందో ఊహకందడం లేదు. పట్టుమని పది వేల జనాభా లేని పల్లెటూరిలోని చిన్న థియేటర్లో సైతం షోలు వేయబోతున్నారు.

మొదటిరోజు ఒక్క ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోనే కోటి గ్రాస్ దాటొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లనే తేడా లేకుండా ఉదయం ఆటలకు పెద్ద స్థాయిలో రికమండేషన్లు వస్తున్నాయి. సాయంత్రం, సెకండ్ షోల బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. ధర సగటు ప్రేక్షకులకు కొంత విపరీతంగా అనిపిస్తుండటంతో టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా ఏ షోకి టికెట్ ముక్క మిగలదనేది ఖాయం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో టికెట్ల ఒత్తిడి ఓ రేంజ్ లో ఉంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ కొరతని దేవరను పలుమార్లు చూడటం ద్వారా తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత రోజుల తరబడి థియేటర్లకు కళకళలాడించిన సినిమా ఏదీ లేదు. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు లాంటి కొన్ని మినహాయించి అధిక శాతం కనీసం అద్దెలు సైతం గిట్టుబాటు చేయించలేదు. ఇప్పుడు దేవర కనక హిట్ అయితే దసరాకు మళ్ళీ కొత్త రిలీజు వచ్చేదాకా ఢోకా ఉండదని ట్రేడ్ అంచనా వేస్తోంది. బాక్సాఫీస్ ఫిగర్స్ షాకింగ్ గా ఉండబోతున్నాయి. హిందీలోనూ తారక్ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు.

This post was last modified on September 24, 2024 12:34 pm

Share

Recent Posts

ఈసీ vs యోగి… ఇది ఊహించలేదే..!

డామిట్... కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. వివాదాస్పద " ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…

6 minutes ago

ధోనీ లేకుండా CSK… ఇప్పుడు మారాల్సింది ఏంటి?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక…

17 minutes ago

అంతా ఎప్పటిలాగే ఉంటుందని చెప్పనన్న నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగాలపై సీఈవో సత్య నాదెళ్ల కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. భారత్ సహా నాలుగు దేశాల్లో ఉద్యోగులకు కంపెనీ…

45 minutes ago

మాట నిలబెట్టుకోవడానికి కింగ్ పరుగులు

లెనిన్ నుంచి ఇట్లు అర్జున దాకా నాగార్జున పలు సందర్భాల్లో టాలీవుడ్ దర్శక నిర్మాతలు పనులు వేగవంతం చేసుకోవడం గురించి…

55 minutes ago

కామెడీ అంటే క్రింజ్ కాదు క్వాలిటీ

చిన్న వయసులో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. దాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద ఛాలెంజ్. ఇది అందరి వల్లా కాదు.…

2 hours ago

హెల్ప్ చేయండి మేడం… నిర్మలమ్మకు చంద్ర‌బాబు విన‌తి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. సుమారు గంట‌న్న‌ర…

2 hours ago