దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం పట్ల సోషల్ మీడియాలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయన స్వంత సినిమా స్టేజి మీద చూసి ఆరేళ్ళు గడిచిపోవడంతో దాని తాలూకు ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కొలవలేనంతగా ఉంది. నిన్న ఒక్కసారిగా వేలాది మంది ఎందుకు ఎగబడి వచ్చారనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. ఇక్కడ రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయి. మొదటిది తారక్ ప్రసంగం. దేవర గురించిన విశేషాలతో పాటు ఫ్యాన్స్ గురించి, తన భవిష్యత్ ప్లానింగ్ గురించి చాలా చెబుతాడనే అంచనాలు బలంగా ఉన్నాయి.
ఏపీలో టిడిపి కూటమిలో అధికారంలోకి వచ్చాక జూనియర్ బయట ప్రసంగిస్తున్న మొదటి వేడుక ఇదే. ఎప్పుడూ లేనంత అధికంగా టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇచ్చారు ఖచ్చితంగా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చేవాడన్నది ఒక కోణం. దాంతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీకి శుభాకాంక్షలు చెబుతూ ఇటీవలే ట్వీట్ చేసిన తారక్ దేవర ఈవెంట్ లోనూ మాట్లాడేవాడని ఇంకొందరు ఆశించారు. ఇక రెండోది అనిరుద్ రవిచందర్ లైవ్ కన్సర్ట్. దేవర ముంగిట నువ్వెంత అంటూ మైకు పట్టుకుని ఊగిపోతూ ఉత్సాహం కలిగిస్తుంటే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయేది. ఇదీ మిస్ చేసుకున్నారు.
ఇక త్రివిక్రమ్, కొరటాల, రాజమౌళి స్పీచ్ గురించి హైప్ మళ్ళీ చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ తెలుగు ప్రసంగాన్ని ప్రత్యేకంగా నేర్చుకుని మరీ వచ్చినా వీడియోతో సరిపెట్టుకొవాల్సి వచ్చింది. ఇంతకీ గెస్టులందరూ వచ్చారో లేక సమాచారం తెలుసుకుని ఇంటి దగ్గరే ఆగిపోయారో దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. త్రివిక్రమ్, నాగవంశీలు రిటర్న్ వెళ్ళిపోతూ కనిపించారు. బయట ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు మాత్రం ఓ రేంజ్ లో కనిపించాయి. అయినా ఏనాడూ జరగనిది ఇంత రభస వెనుక వేరే కారణాలు, ఇతర శక్తులు ఏమైనా ఉన్నాయానే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోందని వినికిడి.
This post was last modified on September 23, 2024 10:56 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……