తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా అన్నపుడు మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. చిరంజీవి సహా ఎందరో టాలీవుడ్ టాప్ స్టార్లు ఆశపడ్డా శంకర్‌తో సినిమా చేయలేకపోయారు. అలాంటిది చరణ్‌కు ఆ అవకాశం వచ్చిందని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ వారిలో ఎగ్జైట్మెంట్‌ను చాలా వరకు తగ్గించే పరిణామాలు జరిగాయి గత మూణ్నాలుగేళ్లలో.
ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. పలుమార్లు షెడ్యూల్స్‌కు బ్రేకులు పడ్డాయి. సినిమా గురించి సరైన అప్‌డేట్స్ లేవు. రిలీజ్ గురించి ఎంతకీ క్లారిటీ రాలేదు. ఈ సినిమా క్రిస్మస్‌కు వస్తుందని దిల్ రాజు చెప్పాక కూడా చాలా వారాలు గడిచిపోయాయి. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ ఇటీవలే సంగీత దర్శకుడు తమన్.. ‘గేమ్ చేంజర్’ డిసెంబరు 20న రాబోతోందని ఒక పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. అయినా సరే అఫీషియన్ న్యూస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఐతే ఎట్టకేలకు ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెకండ్ సింగిల్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఒకేసారి జరగబోతోందట. అందరూ అంచనా వేస్తున్నట్లే డిసెంబరు 20న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించనున్నారట. ఒకట్రెండు రోజుల్లో ఒక పోస్టర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
‘గేమ్ చేంజర్’ డేట్‌ను బట్టి వేరే సినిమాల భవితవ్యం కూడా తేలుతుంది. ఆ సినిమా క్రిస్మస్ వీకెండ్‌కు కన్ఫమ్ అయితే రాబిన్ హుడ్, తండేల్ వాయిదా వేయడం లాంఛనమే. వాటికి కొత్త డేట్లు ఖరారు చేసి ఆ చిత్ర బృందాలు కూడా ప్రకటనలు ఇచ్చేస్తాయి. ‘కన్నప్ప’ సినిమా రిలీజ్ వ్యవహారం కూడా ‘గేమ్ చేంజర్’ డేట్‌ను బట్టే ఉంటుందని తెలుస్తోంది. ‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ ముందే పూర్తయినా.. ఇటీవల కొన్ని సీన్లు రీషూట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి టాకీ పార్ట్ అయితే అవగొట్టేశారట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on September 22, 2024 5:27 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…