రొటీన్ జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలు అందులోనూ సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ ఉండేవి ఎంచుకుంటాడని పేరున్న అడవి శేష్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా రాలేదు. హిట్ 2 ది సెకండ్ కేస్ హిట్టయినా మేజర్ ని మించిన సినిమాని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన నుంచి ఏదైనా మూవీ వస్తోందంటే ప్రత్యేకంగా ఎదురు చూసే అభిమానులు బోలెడున్నారు. వాళ్లకు శుభవార్త చెబుతూ ఇవాళ అడవి శేష్ ఒక ట్వీట్ చేశాడు. 2025లో ఒకటి రెండు కాదు ఏకంగా మూడు రిలీజులు ఉంటాయని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. రవితేజ, నాని లాంటి వాళ్ళు చూపించే ఈ వేగం ఇప్పుడు శేష్ అందిపుచ్చుకున్నాడు.
ఇక్కడో ట్విస్ట్ ఉంది. శేష్ చెప్పినవాటిలో గూఢచారి 2 ఒకటి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ కే రెండేళ్లకు పైగా ఖర్చు పెట్టారు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. రెండోది శృతి హాసన్ జోడిగా నటిస్తున్న డెకాయిట్. షూటింగ్ కు ముందే ఆకట్టుకునే టీజర్ తో అంచనాలు పెంచేసింది. రెండు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి మూడోది ఏంటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. సినిమానా లేక వెబ్ సిరీసా లేక స్వంత ప్రొడక్షన్లో ఇంకేదైనా ప్రయోగం చేస్తున్నాడా ఇదేమి చెప్పకుండా సస్పెన్స్ పెట్టేశాడు.
ఏదైతేనేం అడవి శేష్ నుంచి మూడు సినిమాల రావడం కన్నా పండగ ఏముంటుంది. కెరీర్ ఎప్పుడో మొదలుపెట్టినా బ్రేక్ అందుకోవడానికి బాగా టైం పట్టిన ఈ యూత్ హీరో క్షణంతో తొలి బ్రేక్ అందుకున్నాడు. లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చినా సరే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మేజర్ తో ప్యాన్ ఇండియా గుర్తింపు రావడంతో ఇకపై ప్రతిదీ హిందీ వెర్షన్ కూడా వస్తుంది. నార్త్ ఆడియన్స్ లోనూ గుర్తింపు వచ్చింది కనక సబ్జెక్ట్ సెలక్షన్ తో జాగ్రత్తలు అవసరమే. శేష్ చెప్పిన మూడు రిలీజుల ప్రకారం మొదటిది మార్చి లేదా అంతకన్నా ముందే వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి ఏది ఫస్టవుతుందో.
This post was last modified on September 22, 2024 12:28 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…