ఇండియన్ బాక్సాఫీస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాకు ఇంకో ఆరు రోజులే సమయం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ వచ్చే శుక్రవారమే థియేటర్లలోకి దిగుతోంది. ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల తీసిన సినిమా అయినప్పటికీ దీని మీద ఆ ప్రభావం పెద్దగా లేదు. సినిమాకు తెలుగులోనే కాక వేరే భాషల్లోనూ మంచి హైపే వచ్చింది. కాకపోతే ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కొంచెం మిశ్రమ స్పందన తెచ్చుకోవడం టీంను కలవర పెట్టింది. తారక్ ఫ్యాన్స్ కూడా కొంత కంగారు పడ్డారు.
రెండు మూడు రోజుల నెగెటివిటీ తర్వాత మళ్లీ హైప్ పుంజుకున్నప్పటికీ.. తారక్ అభిమానుల్లో లోలోన కంగారు లేకపోలేదు. ట్రైలర్ ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ ఫీడ్ బ్యాక్ టీంకు కూడా చేరినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రిలీజ్ ముంగిట ‘దేవర’ నుంచి మరో ట్రైలర్ రాబోతోందట. ఫస్ట్ ట్రైలర్‌తో పోలిస్తే బెటర్ షాట్స్, డైలాగ్స్ ఉండేట్లు.. కథ పరంగా ఎగ్జైట్మెంట్ పెంచేలా ఈ ట్రైలర్ కట్ చేస్తున్నాడట కొరటాల.
నిజానికి రిలీజ్ ట్రైలర్ వదిలే ఆలోచన ముందు నుంచే ఉందట. అందుకే ఫస్ట్ ట్రైలర్‌ను విడుదలకు 20 రోజుల ముందే వదిలారు. అది ఆశించిన ప్రయోజనాన్ని నెరవేరిస్తే వేరే ట్రైలర్ వదిలేవారు కాదేమో. కానీ ఆ ట్రైలర్ మిశ్రమ స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో కొత్త ట్రైలర్ అనివార్యమైంది. దీన్ని స్ట్రైకింగ్‌గా ఉండేలా చూసుకుంటే రిలీజ్ ముంగిట హైక్ కూడా కరెక్ట్ మీటర్లో ఉంటుందని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరకు టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలు ఖాయమైనట్లే. ఏపీలో ఆల్రెడీ అనుమతులు వచ్చేశాయి. తెలంగాణలో కూడా లాంఛనమే. ఇంకో రెండు రోజుల్లో టికెట్ల అమ్మకాలు కూడా మొదలు కానున్నాయి.
This post was last modified on September 22, 2024 12:26 am
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…