చిరంజీవి ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, దాని తర్వాత ఏ సినిమా వుంటుందనే దానిపై మీడియాలో చాలా రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఏ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి, దేనిని ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై చిరంజీవికి పిచ్చ క్లారిటీ వుంది. ఆచార్య ముందుగా వచ్చే వేసవిలో విడుదలవుతుంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే రెండవ వారంలో ఈ చిత్రం రిలీజ్ కావడం పక్కా. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ అప్పటికి రిలీజ్ అయ్యేలా చిరు వర్క్ చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత వేదళాం షూటింగ్ ముందుగా స్టార్ట్ అవుతుంది.
అది కొన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న తర్వాత లూసిఫర్ రీమేక్ కూడా మొదలు పెడతారు. వేదళాం రీమేక్ దసరా సీజన్లో విడుదలయ్యేలా, ఆ తర్వాత లూసిఫర్ 2022 సంక్రాంతికి వచ్చేలా చిరంజీవి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆచార్య తర్వాత అస్సలు టైమ్ వేస్ట్ కాకుండా వేదళాం, లూసిఫర్ కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడే పూర్తి చేసేస్తున్నారు. ఆ రెండు సినిమాలలోను చిరంజీవి ఇంచుమించు ఒకే తరహా లుక్‍తో కనిపిస్తారు. వేదళాం కోసం వేసే మరో గెటప్‍కి సంబంధించిన షూట్ ఆచార్య అయిన వెంటనే పూర్తి చేస్తారు. నెక్స్ట్ లుక్‍కి మారిన తర్వాత లూసిఫర్ షూటింగ్ కూడా ప్యారలల్‍గా చేస్తారు.
This post was last modified on September 30, 2020 1:37 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…