దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ విపరీతంగా ఉంది. ఎందుకంటే హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టాలీవుడ్ లో తనో మంచి ఛాయస్ అయితే తమ ప్రాజెక్టులకు సెట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. దేవర రిలీజ్ కు ముందే రామ్ చరణ్ 16కి లాక్ కావడం తన క్రేజ్ ని మరింత పెంచింది. ట్రైలర్ లో ఆమె నటనకు సంబందించిన ఎక్కువ సీన్లు రివీల్ చేయలేదు కానీ తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సంగతి వింటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.
షూటింగ్ స్పాట్ లో రెండు పేజీల డైలాగుని ఏకధాటిగా సింగల్ టేక్ లో చెప్పడం చూసి యూనిట్ షాకై చూస్తుంటే వెంటనే తారక్ కొరటాల శివని ఉద్దేశించి సూపర్ వెంటనే ఓకే చేసేయమని చెప్పేశాడట. అప్పటిదాకా ఆ అమ్మాయి నటనని చూస్తుండిపోయిన దర్శకుడు వెంటనే తేరుకుని కట్ చెప్పాడు. అది ఏ సందర్భంలో వచ్చే సన్నివేశం లాంటివి చెప్పలేదు కానీ మంచి ఎమోషన్ ఉన్న సీనని అర్థమవుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం చిన్న ఎన్టీఆర్ ని ప్రేమించిన ప్రియురాలిగా సెకండాఫ్ లో వచ్చే ఒక ముఖ్యమైన ఎపిసోడ్ లో జాన్వీకి చాలా పవర్ ఫుల్ డైలాగులు పడ్డాయట.
తారక్ చెప్పింది దాన్ని ఉద్దేశించేనని తెలిసింది. శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ మీద కామన్ ఆడియన్స్ ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ లో ఇమేజ్ వేరు, ఇక్కడి ప్రేక్షకుల్లో తన పట్ల ఎక్స్ పెక్టేషన్లు వేరు. వాటిని నిలబెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది. తిరిగి నార్త్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంచక్కా హైదరాబాద్ లోనే మకాం పెట్టేయొచ్చు. ఒకప్పుడు తల్లిని ఎంతో ఆదరించి గొప్ప బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తెలుగు నేలతో కనక బంధం ఏర్పడితే వరసగా స్టార్ హీరోల అవకాశాలతో దూసుకుపోవచ్చు. ఇంకో వారం రోజుల్లో పరీక్ష ఫలితం వచ్చేస్తుంది.
This post was last modified on September 20, 2024 5:24 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……