దర్శకుడు కొరటాల శివ కొంచెం రిజర్వ్డ్ గా మాట్లాడతారని పేరు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎంత స్టార్ హీరోతో సినిమా తీసినా ప్రమోషన్ల టైంలో ఆయన మాటలు సెటిల్డ్ గా ఉంటాయి. దేవర కోసం సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్న కొన్ని మాటలు వైరలవుతున్నాయి. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి పని వాళ్ళను చేసుకోనివ్వాలని, అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టి, మనం పని చేయక అడ్డు పడితే దానికి బాధ్యత తీసుకోవడం కష్టమనే రీతిలో చెప్పడంతో సోషల్ మీడియాలో రకరకాల నిర్వచనాలు చెప్పేస్తున్నారు.
అందరికీ ముందు గురొచ్చేది ఆచార్యనే. కొరటాల కెరీర్ లో మొదటిసారి డిజాస్టర్ అనుభవం దక్కింది దాని వల్లే. ఆ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు చిరంజీవి ఎక్కువ జోక్యం చేసుకున్నారని, అవసరం లేకపోయినా రామ్ చరణ్ పాత్రను పొడిగించారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. చిరు సైతం ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పింది చేయడం తప్ప తన ఇన్వాల్ మెంట్ ఉండదని చెప్పడమూ మెగా ఫ్యాన్స్ పంచుకున్నారు. ఏదైతేనేం ఆచార్య తర్వాత మీడియాకు కనిపించకుండా వెళ్ళిపోయిన కొరటాల శివ తిరిగి దేవర విడుదల దగ్గరగా ఉన్నప్పుడు కొత్త ఉత్సాహంతో మూవీ కబుర్లు పంచుకుంటున్నారు.
కొరటాల అన్నది సహజ ధోరణిలోనే కావొచ్చు. దాన్ని ఆచార్యకు ముడిపెట్టడం రైటా రాంగా చెప్పలేం కానీ ఎక్స్ సామజిక మాధ్యమంలో ప్రతిదీ భూతద్దంలో చూస్తున్న ట్రెండ్ లో నానార్ధాలు తీయడం సహజం. అయినా దేవర బ్లాక్ బస్టర్ విషయంలో కొరటాల చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. తిరుమలలో స్వామి దర్శనం చేసుకున్నాక బయట కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మాట్లాడుతూ సక్సెస్ మీట్ లో కలుద్దామని చెప్పడం దానికి సంకేతమే. కల్కి 2898 ఏడి తర్వాత అంత భారీ స్కేల్ లో విడుదలవుతున్న ప్యాన్ ఇండియా మూవీగా దేవర పార్ట్ 1 అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.
This post was last modified on September 20, 2024 3:49 pm
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…