రేపు కొత్త శుక్రవారం అనే ఆనందం బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. కౌంట్ పరంగా సినిమాలైతే ఉన్నాయి కానీ దేనికీ కనీస బజ్ లేకపోవడం చూస్తే మార్నింగ్ షోకు సగం జనమైనా వస్తే గొప్పే అనుకోవాలి. మొన్నటిదాకా ప్రమోషన్లు చేసుకున్న సుహాస్ ‘గొర్రె పురాణం’ ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. పేపర్ ప్రకటనల్లోనూ కనిపించలేదు. వాయిదా పడిందో లేదో చెప్పిన ప్రకారం వస్తుందో టికెట్ల అమ్మకాలు మొదలయ్యే దాకా చెప్పలేం. బాలయ్య దగ్గర పని చేసిన స్టాఫ్ నిర్మించిన ‘పైలం పిలగా’కు ఆయనే అంతో ఇంతో పబ్లిసిటీగా మారారు తప్పించి బజ్ అయితే లేదు.
ఇవి కాకుండా హైడ్ అండ్ సీక్, చిక్లెట్స్, మన్యంధీరుడు సీతారామరాజు, బీచ్ రోడ్ చేతన్, 100 క్రోర్స్ అనే మరో అయిదు చిన్న చిత్రాలు బరిలో ఉన్నాయి. వీటికంటే ఎక్కువ రీ రిలీజుల హడావిడి కనిపిస్తోంది. రజనీకాంత్ ‘శివాజీ’కి భారీ రెస్పాన్స్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మూవీ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ‘బొమ్మరిల్లు’కి శనివారం మంచి విడుదల దక్కేలా దిల్ రాజు ప్లాన్ చేసుకున్నారు. శర్వానంద్ ‘జర్నీ’ మరోసారి ఆడియన్స్ ని పలకరిస్తోంది. గత ఏడాది వచ్చి వెళ్లిన రవితేజ ‘వెంకీ’ని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఒకే వారం ఇన్ని రీ రిలీజులు ఈ మధ్య జరగలేదు.
సెప్టెంబర్ 27 దేవర పార్ట్ 1 రాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు దానికి వారం ముందు వచ్చేందుకు సాహసం చేయకపోవడంతో అన్ని చిన్న సినిమాలు మెరుపు దాడి చేస్తున్నాయి. మత్తువదలరా 2కి ఇంకో వీకెండ్ బ్రహ్మాండంగా పని చేయబోతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ జరిగి లాభాల్లోకి ప్రవేశించడంతో బయ్యర్లు ఆనందంలో ఉన్నారు. వంద కోట్ల గ్రాస్ దాటేసిన సరిపోదా శనివారం ఈ నెలాఖరుకి ఓటిటిలో వచ్చే అవకాశమున్నప్పటికీ ఇప్పటికే ఫైనల్ రన్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఎంతొచ్చినా ఇప్పుడు బోనస్ కిందకు వస్తుంది. కొత్త సినిమాలు ఏ మేరకు నిలబడతాయనేది టాక్ మీదే ఆధారపడి ఉంది.
This post was last modified on September 19, 2024 11:04 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…