తెలుగు సినిమాల రేంజ్ రోజు రోజుకూ పెరిగిపోతోందని.. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయికి మన సినిమాలు వెళ్లిపోతున్నాయని గొప్పలు పోతున్నాం కానీ.. మన దగ్గర రిలీజవుతున్న సినిమాల్లో ఎన్ని విజయవంతం అవుతున్నాయన్నది చూడట్లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతున్న విషయాన్ని గుర్తించట్లేదు. ప్రేక్షకులకు థియేటర్లకు రావడం క్రమంగా తగ్గిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వెండితెరల్లో వెలుగుుల తగ్గిపోతున్నాయి. పెద్ద సినిమాలు వచ్చి, వాటికి మంచి టాక్ వస్తే తప్ప ఎక్కువ రోజుల పాటు థియేటర్లు నిండట్లేదు.
ఐతే మంచి క్రేజ్ మధ్య వస్తున్న సినిమాలకు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని అనవసర నెగెటివిటీ తప్పట్లేదు. స్టార్ హీరోల అభిమానుల మధ్య నిత్యం జరిగే గొడవల పుణ్యమా అని.. తమ హీరోకు, అతడి సినిమాకు ఎలివేషన్ ఇవ్వడం కంటే అవతలి హీరోను కించపరచడం, తన సినిమా పట్ల నెగెటివిటీ పెంచడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు నెటిజన్లు.
ఈ ఏడాది సక్సెస్ రేట్ మరీ తగ్గిపోయి ఇబ్బంది పడుతోంది టాలీవుడ్. పెద్ద సినిమాలు బాగా ఆడితే తప్ప ఇండస్ట్రీ మనుగడ సాగని పరిస్థితుల్లో వచ్చే మూడు నెలల్లో వచ్చే మూడు భారీ చిత్రాల మీద చాలా ఆశలు పెట్టుకుంది టాలీవుడ్. ఆ మూడు సినిమాలే.. దేవర, పుష్ప-2, గేమ్ చేంజర్. ఈ మూడు చిత్రాలు బాగా ఆడితే టాలీవుడ్‌కు కొత్త ఊపిరి వస్తుంది. ఈ చిత్రాల మీద భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాతలతో పాటు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కొండంత ఆశలతో ఉన్నారు.
ముందుగా ‘దేవర’ మీద అందరి దృష్టీ నిలిచి ఉంది. ఐతే ఈ మూవీ ట్రైలర్‌కు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. ఆ నెగెటివిటీని ఇంకా ఇంకా పెంచి సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే వీళ్లిప్పుడీ సినిమాను టార్గెట్ చేసి ఏదైనా డ్యామేజ్ చేస్తే.. తర్వాత ఆ అభిమానులు ఆరాధించే హీరో సినిమాను వాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. ఇది ఇద్దరికీ నష్టం చేకూర్చే విషయమే. కాబట్టి ‘దేవర’ పట్ల నెగెటివిటీ తగ్గడం చాలా వసరం.
దేవరకు మంచి ఆరంభం దక్కితే.. ఈ సినిమా బాగా ఆడితే ఇండస్ట్రీకి మంచి ఊపు వస్తుంది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడితే టాలీవుడ్ పేరు మరోసారి మార్మోగుతుంది. అప్పుడు పుష్ప-2, గేమ్ చేంజర్ చిత్రాలకూ ప్లస్ అవుతుంది. అవీ బాగా ఆడితే ఈ ఏడాది టాలీవుడ్ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీ అవుతుంది. కాబట్టి నెగెటివిటీని పక్కన పెట్టి ‘దేవర’ బాగా ఆడాలని వేరే హీరోల అభిమానులు కూడా కోరుకోవడం మంచిది.
This post was last modified on September 18, 2024 9:41 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…