లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై ఇప్పుడు ఏకంగా పెద్ద బిల్డింగుల దాకా పాకుతున్నాయి. ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని దీని మీద విచారణ జరుపుతున్నామని, తొంబై రోజుల్లో రిపోర్ట్ సిద్ధం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూనమ్ కౌర్ ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించి ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. అప్పుడే తన ఫిర్యాదు మీద చర్య తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని చెప్పడంతో షాక్ తినడం అందరి వంతయ్యింది.
నిజానికి క్యాస్టింగ్ కౌచ్ వివాదాలు కొత్త కాదు. ప్రతి బాషా పరిశ్రమలో ఉన్నవే. ఇటీవలే హేమ రిపోర్ట్ మలయాళం పరిశ్రమలో రేపిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఏకంగా అమ్మ సంఘం నుంచి మోహన్ లాల్ రాజీనామా చేసే దాకా వెళ్ళింది. జానీ మాస్టర్ మీద అభియోగాలు వచ్చిన కొన్ని గంటల్లోనే జనసేన కార్యకలాపాల నుంచి దూరం పెట్టడంతో దీనికి రాజకీయ రంగు పులిమేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సహజం. ఇంకా కేసు నిరూపితం కాకపోయినా ఆధారాలు బలంగా ఉన్నాయనే టాక్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. వ్యవహారం మాత్రం చాలా వేడిగా ఉంది.
ఇదిలా ఉంటే ఆ అమ్మాయికి ఒక స్టార్ హీరో తన సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పినట్టుగా వచ్చిన వార్త ఇంకో ట్విస్ట్. దానికి అధికారిక ధృవీకరణ లేకపోయినా వేగంగా పాకిపోతోంది. ఇలాంటి కాంట్రావర్సిలు కొంత కాలం పాటు మీడియాలో హాట్ టాపిక్ గా ఉండి తర్వాత చల్లారిపోవడం పలుమార్లు జరిగింది కాబట్టి ఈసారి ఏమవుతుందో ముందే ఊహించలేని స్థితి నెలకొంది. డాన్సర్ అసోసియేషన్ సైతం ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఇంకా ఎవరెవరు ఏఏ రూపంలో బయటికి వస్తారో, ఎలాంటి కొత్త విషయాలు పుట్టుకొస్తాయో ఇదంతా ఒక సస్పెన్స్ మూవీని తలపిస్తోంది. క్లైమాక్స్ ఎక్కడ ఉంటుందో మరి.
This post was last modified on September 17, 2024 4:50 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…