శంకర్ ఆడుతున్న ఒత్తిడి గేమ్

సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్ రాజు టీమ్ ప్రకటించి రోజులు గడిచిపోతున్నా ఎలాంటి సౌండ్ లేదు. రెండో ఆడియో సింగల్ ఈ నెలలోనే వస్తుందని వినాయక చవితి పోస్టర్ లో చెప్పారు.

ప్రస్తుతం దాని ఊసు వినిపించడం లేదు. సంగీత దర్శకుడు తమన్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇస్తున్నాడు కానీ అసలు మ్యాటర్ చెప్పడం లేదు. జరగండి జరగండి పాట విషయంలో జరిగిన పొరపాట్లు ఈసారి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీని సంగతి కాసేపు పక్కనపెట్టి శంకర్ విషయానికి వద్దాం.

డిసెంబర్ లో విడుదల చేయాలన్న దిల్ రాజు సంకల్పానికి అనుగుణంగా శంకర్ చాలా ఒత్తిడి మధ్య పోస్ట్ ప్రొడక్షన్ అనే గేమ్ ఆడుతున్నారు. ఏకంగా ఎడిటర్ ని మార్చాల్సి వచ్చిందని టాక్. షామీర్ మొహమ్మద్ స్థానంలో అంటోనీ రూబెన్స్ వచ్చినట్టు చెన్నై రిపోర్ట్.

సిజి వర్క్స్ దగ్గరుండి చూసుకుంటున్న శంకర్ వేరే ఏ డెడ్ లైన్స్ పెట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఒత్తిడి చేస్తున్నారనో లేదా ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారనో తొందరపడేందుకు ఇష్టపడటం లేదు. అందుకే అంతర్గతంగా లాకైన డిసెంబర్ 20ని ఎస్విసి టీమ్ అఫీషియల్ గా చెప్పలేకపోతోందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

ఇండియన్ 2 మీద దారుణమైన విమర్శలు, కెరీర్ లో ఎప్పుడూ చూడనంత ఘోరమైన అవమానం ఎదురుకున్న శంకర్ కు కంబ్యాక్ కావాలంటే గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. ఇండియన్ 3 బిజినెస్ మెరుగ్గా జరగాలన్నా తన బ్రాండ్ మెరుగు పడాలి.

మళ్ళీ రామ్ చరణ్ రేంజ్ స్టార్ దొరకడం దక్షిణాదిలో కష్టం కావొచ్చు. హిట్టు కొడితే అప్పుడు ఎవరైనా కథలు వింటారు, చేస్తారు. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు కనిపిస్తారా లేదానేది బయటికి రానివ్వకుండా సస్పెన్స్ పెట్టారు.