ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్ చేస్తే నిజంగా చూస్తారానే అనుమానం మొదట ట్రేడ్ లో ఉండేది. అందులోనూ సీరియస్ హారర్ మూవీ కాబట్టి ఏదో ఓ మోస్తరుగా ఆడితే చాలనుకున్నారు.
కట్ చేస్తే తుంబాడ్ అంచనాలకు మించి ఆడేస్తోంది. 2018 మొదటిసారి విడుదలైనప్పుడు తొలి వీకెండ్ ఇది రాబట్టిన మొత్తం కేవలం 3 కోట్ల 25 లక్షలు. ఇప్పుడు ఏకంగా 125 శాతానికి మించిన పెరుగుదలతో శుక్ర, శని, ఆదివారాలు కలిపి తొలి వారాంతానికి ఏకంగా 7 కోట్ల 34 లక్షలు రాబట్టి ఔరా అనిపించింది.
గత ఇరవై నాలుగు గంటల అడ్వాన్స్ బుకింగ్స్ ని పరిగణనలోకి తీసుకుంటే బుక్ మై షోలో ఏకంగా 90 వేల టికెట్లు అమ్ముడుపోవడం చూస్తే ఎవరికైనా నోట మాట ఆగిపోవాల్సిందే. ఇండియా వైడ్ విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, టోవినో థామస్ ఏఆర్ఎం తర్వాత మూడో స్థానంలో నిలవడం విశేషం. టాలీవుడ్ తాజా హిట్ మత్తు వదలరా నాలుగో ప్లేసులో ఉండటం గమనార్హం.
ఇంతగా తుంబాడ్ ని ఎగబడి చూసేందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈ కల్ట్ క్లాసిక్ ఏ ఓటిటిలోనూ అందుబాటులో లేదు. ఒప్పందం అయిపోయిన కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడో తీసేశారు.
దీంతో అప్పట్లో థియేటర్, డిజిటల్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయినవాళ్లు తుంబాడ్ చూసేందుకు ఎగబడుతున్నారు. రెండో భాగం ఉందని అధికారికంగా ఇందులోనే ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి.
స్క్రిప్ట్ రాసి, సినిమా తీసేందుకు అక్షరాలా పది సంవత్సరాలు పట్టిన తుంబాడ్ నిజంగా వెండితెరపై చూడాల్సిన సినిమా. ఒక గొప్ప అనుభూతిని భయంతో పాటు వడ్డిస్తుంది. థ్రిల్ నూ పంచుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల ప్రీమియర్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కావడం అసలు ట్విస్ట్. తిరిగి మళ్ళీ ఓటిటికి వస్తుందో లేదో అనే సందేహంతో జనం ఎగబడుతున్నారు.
This post was last modified on September 16, 2024 7:00 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…