గత నెల విడుదలై భారీ విజయం అందుకున్న ఆయ్ థియేట్రికల్ గా మంచి రెవిన్యూ సాధించింది. అయితే బిగ్ స్క్రీన్ మీద మిస్ అయిన ప్రేక్షకులు భారీగానే ఉన్నారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ప్రీమియర్ మొదలైన సంగతి తెలిసిందే.
ఆడుతున్న టైంలో జరగని డిబేట్ ఇప్పుడు డిజిటల్ లో వచ్చాక రాజుకోవడం విచిత్రం. అదేంటో చూద్దాం. క్లైమాక్స్ కి ముందు బాలకృష్ణ అభిమాని అయిన హీరోయిన్ తండ్రికి ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి ఫ్యాన్ అయిన హీరో నాన్న కొట్టడమనే ట్విస్టుని ఒక పాత్ర ద్వారా చిన్న ఎలివేషన్ ఇచ్చి రివీల్ చేస్తారు. ఇది బాగా పేలిన సన్నివేశం. పెద్దగా వివాదమూ కాదు.
కానీ ఇప్పుడు మాత్రం ఉద్దేశపూర్వకంగానే దర్శకుడు ఆ ఎపిసోడ్ పెట్టారని బాలయ్య, చిరు ఫ్యాన్స్ పరస్పరం ట్రోలింగ్ కి దిగిపోతున్నారు. ఇది మా రేంజని మెగా ఫాలోయర్స్ కవ్విస్తుండగా దానికి ధీటుగా నందమూరి అభిమానులు పాత సినిమాల్లోని వీడియోలు బయటికి తీస్తున్నారు.
ఉదాహరణకు దొంగమొగుడులో ఎన్టీఆర్ వేటగాడు ఆడుతున్న థియేటర్ ముందు చిరంజీవి గుడ్డివాడిగా బ్లాక్ టికెట్లు అమ్ముకునే సీన్ ఉంటుంది. దాన్ని షేర్ చేస్తున్నారు. దానికి ప్రతిగా ఆదిత్య 369లో బాలయ్య టేప్ రికార్డర్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి పాటని ప్లే చేసే బిట్ ని బయటిని తీశారు.
ఇలా నువ్వా నేనాని పరస్పరం ఇద్దరి ఫ్యాన్స్ కవ్వించుకుంటూనే ఉన్నారు. నిజానికి స్టార్ హీరోలకు ఎలాంటి భేషజాలు ఉండవు కాబట్టే అవతలి వాళ్ళ రెఫరెన్సులు తమ సినిమాల్లో వాడుకుంటారు. సమరసింహారెడ్డి స్ఫూర్తితోనే ఇంద్రలో నటించానని చిరు ఈ మధ్యే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో చెప్పారు.
దానికి కొద్దిరోజుల ముందే రామ్ చరణ్ నాకు చాలా క్లోజని బాలయ్య చెప్పిన వీడియో వైరలయ్యింది. ఇంత స్పష్టంగా వాళ్ళ మధ్య అనుబంధం కొనసాగుతూ ఉంటే ఆన్ లైన్ లో మాత్రం అభిమానులు కవ్వించుకోవడం విచిత్రం. ఇదే ఆయ్ కు మరోరకంగా పబ్లిసిటీ మెటీరియల్ గా మారిందంటే ఆశ్చర్యం లేదు.
This post was last modified on September 16, 2024 11:54 am
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…