స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్ తో రూపొంది అసలు ఓపెనింగ్స్ అయినా వస్తాయానే అనుమానాలు తలెత్తినవి జనాన్ని థియేటర్లకు రప్పిస్తే వాటిని నిజంగా అద్భుతమే అనాలి.
గత రెండు నెలల్లో ఏకంగా నాలుగు ఉదాహరణలు దీనికి సాక్ష్యంగా నిలవడం టాలీవుడ్ లో ఉరకలేస్తున్న కొత్త రక్తం తాలూకు జోరుని చూపిస్తోంది. నీహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ వచ్చిన ‘కమిటీ కుర్రోళ్ళు’ విపరీతమైన పోటీ మధ్య థియేటర్ల కొరతలోనూ సూపర్ హిట్ కొట్టి వావ్ అనిపించుకుంది.
గీతా ఆర్ట్స్ 2 లాంటి పెద్ద బ్యానర్ నిర్మించినా రవితేజ, రామ్, విక్రమ్ లాంటి పెద్దోళ్లతో పోటీ పడాల్సి వచ్చిన ‘ఆయ్’ అనూహ్య విజయం సాధించడం అనూహ్యం. అంజి కె మణిపుత్ర డైరెక్షన్ అతనికి బోలెడు అవకాశాలు తెచ్చి పెడుతోంది. మంచి లాభాలు మూటగట్టుకునేలా చేసింది.
రానా సమర్పకుడిగా వ్యవహరించిన ’35 చిన్న కథ కాదు’ వసూళ్ల పరంగా గ్రేట్ అనిపించుకోకపోయినా ఉన్నంతలో మంచి రన్ సాధించి ఇటు రివ్యూలు అటు ఆడియన్స్ ఇద్దరితోనూ శభాష్ అనిపించుకుంది. ఇంకొంచెం బలమైన మార్కెటింగ్ చేసి ఉంటే తర్వాతి స్థాయికి వెళ్ళేదన్న కామెంట్ లో నిజం లేకపోలేదు.
ఇక తాజా సంచలనం ‘మత్తు వదలరా 2’ ఏకంగా బాక్సాఫీస్ బూజు దులుపుతోంది. ఊహించిన దానికన్నా భారీగా థియేటర్లను నింపేస్తోంది. సత్య కామెడీ మీద సూపర్ పాజిటివ్ టాక్ రావడం మైత్రి సంస్థకు లాభాలను కురిపిస్తోంది. ఇక్కడ చెప్పిన నాలుగు సినిమాల్లోనూ స్టార్లు లేరు.
ఉన్నది కేవలం కంటెంట్ మాత్రమే. యంగ్ టెక్నీషియన్స్ ప్రతిభతో విజయం సాధించాయి. ఇలాంటివి జనం కేవలం ఓటిటిలోనే చూస్తారనే భ్రమలను బద్దలు కొడుతూ థియేటర్లకు జనాన్ని రప్పించాలంటే ఏం చేయాలో ప్రత్యక్షంగా నిరూపించాయి. అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కు దిక్సూచిలా నిలబడ్డాయి.
This post was last modified on %s = human-readable time difference 1:05 pm
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…
విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని…