Movie News

నాని సక్సెస్ – చదవాల్సిన కేస్ స్టడీ

న్యాచురల్ స్టార్ నాని తాజా బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం దిగ్విజయంగా వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టేసింది. దసరా తర్వాత అతి తక్కువ గ్యాప్ లో రెండో సారి ఈ మైలురాయిని అందుకున్న హీరోగా మరో ఘనతను స్వంతం చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి టయర్ వన్ హీరోలను మినహాయిస్తే ఎవరి వల్ల ఇది సాధ్యం కాలేదు.

మధ్యలో హాయ్ నాన్న కూడా మంచి వసూళ్లనే రాబట్టింది కానీ మాస్ అప్పీల్ లేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో కలెక్షన్లు కొంత పరిమితికి కట్టుబడాల్సి వచ్చింది. హిట్ 2 ది థర్డ్ కేస్ నిర్మాణంలో ఉండగానే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక సక్సెస్ కేస్ స్టడీ ఎందుకు అయ్యాడో చూద్దాం.

నాని గత కొంత కాలంగా కాంబోలను నమ్ముకోవడం లేదు. తన కలయికలోనే అంటే సుందరానికి ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయకు మరో అవకాశం ఇచ్చి గొప్ప ఫలితం అందుకున్నాడు.

గత చిత్రం డిజాస్టరైనా దాన్ని పట్టించుకోకుండా ప్రొడ్యూసర్ గా తనకు రెండు హిట్లిచ్చిన శైలేష్ కొలనుకి ఎస్ చెప్పాడు. డెబ్యూ దర్శకులనే అనుమానం కన్నా వాళ్ళ కథలోని గొప్పదనం గుర్తించడం వల్లే శౌర్యువ్, శ్రీకాంత్ ఓదెల అనే కొత్త టాలెంట్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాయి.

గతంలో నాని వి, టక్ జగదీశ్, గ్యాంగ్ లీడర్ లాంటి పొరపాట్లు చేశాడు. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలే స్క్రిప్టుల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేసేలా చేస్తున్నాయి.

రజనీకాంత్ వెట్టయన్ లో రానా కన్నా ముందు అడిగింది నానినేనని అప్పట్లో మాట్లాడుకున్నారు. సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కన్నా తన ప్రాధ్యాన్యం ముఖ్యమనుకునే ఆలోచన వల్లే అలాంటి స్థిర నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. బలగం వేణుతో సినిమాని పెండింగ్ ఉంచడానికి కారణం క్వాలిటీ కోసమే.

ఓవర్సీస్ లో నాని మార్కెట్ బాగా బలపడింది. ఎన్ఆర్ఐలలో గ్యారెంటీ బ్రాండ్ పేరు తెచ్చుకున్నాడు. మాస్ కు తాను పర్ఫెక్ట్ గా నప్పుతానని దసరా, సరిపోదా శనివారంతో ఋజువు చేసుకున్న నాని భవిష్యత్ ప్లానింగ్ కూడా ఇదే తరహాలో ఉండబోతోందనేందుకు ఇంత కన్నా నిదర్శనం వేరే కావాలా.

This post was last modified on September 16, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

11 minutes ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

33 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

1 hour ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago