తప్పు చేశారా? లేదా? అన్నది పక్కన పెడితే.. వరుస వివాదాలతో కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుంటాయి. ఆ కోవలోకే వస్తారు టాలీవుడ్.. కోలీవుడ్ లలో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గడిచిన కొంతకాలంగా ఆయనపైన ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా మారారు.
తాజాగా 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు ఇచ్చారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై బాధితురాలు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి తదుపరి విచారణ కోసం బాధితురాలు ఉండే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
చెన్నై, ముంబయి.. హైదరాబాద్ లతో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ లకు వెళుతున్న వేళలోనూ.. హైదరాబాద్ లోని తన నివాసమైన నార్సింగ్ లోనూ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిజానికి రెండు రోజుల క్రితమే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. ఆలస్యంగా బయటకు వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ మీద అత్యాచారం.. బెదిరింపులకు పాల్పడటం.. గాయపర్చటం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. గతంలోనూ పలు వివాదాల్లో జానీ మాస్టర్ పేరు తెర మీదకు వచ్చింది. 2015లో ఒక కాలేజీలో మహిళపై దాడి కేసులో జైలుశిక్షను కోర్టు విధించింది. ఈ ఉదంతంపై జానీ మాస్టర్ స్పందించాల్సి ఉంది.
This post was last modified on September 16, 2024 10:35 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…