ఒకప్పుడు సినిమాల్లో కథతో సంబంధం లేకుండా కమెడియన్లకు సెపెరేట్ ట్రాక్స్ ఉండేవి. వీటిని మెయిన్ రైటర్స్ తో కాకుండా వేరే రచయితలతో రాయించేవారు. ఎంతలేదన్నా పావు గంట నుంచి ఇరవై నిమిషాల దాకా పెట్టేవారు.
బ్రహ్మానందం, ధర్మవరపు, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ అలా పేరు తెచ్చుకున్నవాళ్ళే. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఇలా సాధ్యపడకపోవడంతో హీరో, అతని ఫ్రెండ్స్ మధ్య హాస్యాన్ని పుట్టించడమనే ట్రెండ్ మొదలైంది. ఎప్పటి నుంచి అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇరవై దశకం నుంచి ఈ పోకడ ఎక్కువయ్యింది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం సత్య.
నిన్న విడుదలైన మత్తు వదలరా 2కి పాజిటివ్ టాక్ రావడంలో సత్య పోషించిన పాత్ర చాలా కీలకం. బయటికి వచ్చిన ఆడియన్స్ శ్రీసింహ గురించి కాకుండా సత్య గురించే మాట్లాడుకుంటున్నారంటే దానికి కన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం పగలబడి నవ్వించేలా పేల్చిన లైనర్స్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఒకదాన్ని మించి మరొకటి ఓ రేంజ్ లో చక్కిలిగింతలు పెట్టాయి. మత్తువదలరా 1లోనూ తన టాలెంట్ చూపించిన సత్యకు దర్శకుడు రితీష్ రానా ఈసారి దానికి రెట్టింపు స్కోప్ ఇచ్చాడు. ఎంతలా అంటే స్క్రీన్ ని తినేస్తాడేమో అని డౌట్ వచ్చే రేంజ్ లో.
నిజానికి సత్యలో ఇంత మంచి పొటెన్షియాలిటీ ఉందని గతంలో ఎన్నోసార్లు రుజువయ్యింది. హనుమాన్ లాంటి విజువల్ గ్రాండియర్ లో కనిపించేది కొన్ని నిమిషాలే అయినా తన ఉనికిని చాటుకున్నాడు.
డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ లో కాస్త ఎంటర్ టైన్ చేసింది ఎవరయ్యా అంటే మళ్ళీ వినిపించే సమాధానం సత్య. రంగబలి ఫ్లాప్ అయినా దాని గురించి ఒక నలుగురు మాట్లాడుకున్నారంటే రీజనేంటో చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా దర్శకులు గుర్తించాల్సింది ఒకటుంది. సత్య వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ఇస్తాడు. కాకపోతే దాని ఉపయోగించుకునే టెక్నిక్, రాసే తెలివితేటలు ఉండాలి. మిగిలింది తను చూసుకుంటాడు.
This post was last modified on September 16, 2024 6:42 am
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…