టాలీవుడ్ కమెడియన్ దాదాపు దశాబ్దంన్నర కిందట్నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్‌తో చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ సత్య. చాలా ఏళ్ల పాటు అతను చిన్న చిన్న పాత్రలతోనే నెట్టుకొచ్చాడు. ఐతే గత కొన్నేళ్ల నుంచి నెమ్మదిగా అతను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆకర్షణగా మారుతున్నాడు.
మత్తు వదలరా, రంగబలి లాంటి సినిమాల్లో తన కామెడీ కడుపుబ్బ నవ్వించింది. హీరోగా చేసిన వివాహ భోజనంబులో నవ్వించడంతో పాటు కన్నీళ్లూ పెట్టించాడు సత్య. గతంతో పోలిస్తే చాలా బిజీ అయినప్పటికీ.. తన టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా ఇంకా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు మత్తువదలరా-2 ఆ లోటును తీర్చిందనే చెప్పాలి. ఈ సినిమాకు యుఎస్‌లో తొలి షో పడ్డ దగ్గర్నుంచి సత్య పేరు మార్మోగిపోతోంది.
మత్తువదలరా-2 సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా.. ఇందులో హీరో శ్రీ సింహా అయినా.. అందరూ మాట్లాడుతున్నది సత్య గురించే. సినిమాకు అతనే ప్రధాన ఆకర్షణ అనడంలో మరోమాటలేదు. మత్తువదలరాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా.. సినిమాలో వేరే ఆకర్షణలు అంతగా పేలకపోయినా.. సత్య కామెడీ మాత్రం భలే వర్కవుట్ అయింది. తొలి సీన్ నుంచి చివరి వరకు ప్రతి సీన్లోనూ సత్య నవ్వించాడు.
తన టిపికల్ కామెడీ టైమింగ్.. డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు బాగా ప్లస్ అయ్యాయి. స్పూఫ్, పేరడీలు చేయడంలో దిట్ట అయిన సత్యను దర్శకుడు రితేష్ రాణా బాగా వాడేసుకున్నాడు. తన ఫోకస్ అంతా సత్య మీదే పెట్టాడా అనిపించేలా తనకు భలే సీన్లు సెట్ చేశాడు.. డైలాగులు కూడా బాగా రాశాడు. దీంతో సత్య వీటిని ఉపయోగంచుకుని చెలరేగిపోయాడు. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే అది ప్రధానంగా సత్య వల్లే. తన కెరీర్లో ఈ సినిమా పెద్ద మలుపు అనడంలో సందేహం లేదు.
This post was last modified on September 14, 2024 2:12 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…