థియేటర్ దాకా ఏం వెళతాంలే ఇంట్లోనే టైం పాస్ చేద్దామని చూసే ప్రేక్షకులకు కొదవ లేదు. ముఖ్యంగా ఓటిటిలు విస్తృతంగా పెరిగిపోయాక హోమ్ ఎంటర్ టైన్మెంట్ కు పెద్ద పీఠ దక్కుతోంది. దానికి తగ్గట్టే బాక్సాఫీస్ రిలీజుల కోసం ఎదురు చూసినట్టు ప్రతి గురు శుక్రవారాల్లో కొత్త కంటెంట్ కోసం వెయిట్ చేసే అభిమానులు కొల్లలుగా పెరిగిపోతున్నారు. ఈ వారం వాళ్లకు మాములు వినోదం లేదు. ముఖ్యంగా గత నెల ఆగస్ట్ లో ఊహించని స్థాయిలో సూపర్ హిట్స్ గా నిలిచిన గీతా ఆర్ట్స్ ‘ఆయ్’ నీహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండూ ఒకేసారి వేర్వేరు యాప్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేయడంతో వ్యూస్ భారీగా ఉన్నాయి.
నెగటివ్ టాక్ కి జడుసుకుని ‘మిస్టర్ బచ్చన్’ని దూరం పెట్టిన మూవీ లవర్స్ ఇప్పుడో లుక్ వేస్తున్నారు. అలాని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం లేదు సరికదా కొన్ని సీన్లు వీడియో రూపంలో కత్తిరించి సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ తిట్టి పోస్తున్నారు. మలయాళంలో క్రిటిక్స్ మెచ్చుకున్న’ తలవన్’ కి మంచి స్పందన కనిపిస్తోంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మధ్య ఈగోని క్రైమ్ కి ముడిపెట్టిన తీరుకి ప్రశంసలు దక్కుతున్నాయి. కీర్తి సురేష్ ‘రఘు తాత’ తమిళంలో ఆగస్ట్ 15 రిలీజై తెలుగులో మాత్రం డైరెక్ట్ డిజిటల్ వెర్షన్ ద్వారా వచ్చింది. పార్తిబన్ తీసిన చైల్డ్ హారర్ ‘టీన్జ్’ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది.
మల్లువుడ్ లో మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకున్న ‘నున్నకుజి’ని తెలుగులోనూ ఇచ్చారు. ఇవి కాకుండా పలు వెబ్ సిరీస్ లు వినోదాన్ని అందించేందుకు వచ్చాయి. గత వారం వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’కు ఓటిటిలోనూ పరాభవం తప్పలేదు. ఇంకోపక్క థియేటర్లలో మత్తువదలరా 2, భలే ఉన్నాడే, కళింగ, ఏఆర్ఎం లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజైనా వాటికి మించిన కౌంట్ తో ఇలా డిజిటల్ లోనూ ఇన్ని ఆప్షన్లు ఉంటే ప్రేక్షకులకు పండగ కాక మరేమిటి. అయినా అతివృష్టిలాగా అన్నిఒకేసారి ఇలా ఇవ్వకపోతే వారానికి ఒకటి రెండు ఇవ్వొచ్చు కానీ కాంపిటీషన్ అలా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు.
This post was last modified on September 13, 2024 3:18 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…