Movie News

యువ హీరోలను కాపాడతాయా?

మళ్లీ శుక్రవారం వచ్చేసింది. కొత్త సినిమాల సందడిని తెచ్చేసింది. ఈ వారం సినిమాలు యువ కథానాయకుల కెరీర్లకు చాలా కీలకంగా మారాయి. ‘మత్తువదలరా’తో ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చిన కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా.. ఆ తర్వాత హిట్ రుచి ఎరగలేదు.

తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, బాగ్ సాలే, ఉస్తాద్.. ఇలా వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయే పరిస్థితి తలెత్తింది. ఇక అతను పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే ఈ కష్ట కాలంలో మళ్లీ ‘మత్తువదలరా’ టీంనే నమ్ముకున్నాడతను.

ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి.. తర్వాత ‘హ్యాపీ బర్త్ డే’తో నిరాశపరిచిన రితేష్ రాణా.. సింహానే హీరోగా పెట్టి ‘మత్తువదలరా-2’ తీశాడు. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని నేరుగా టీజర్‌తో పలకరించిన ఈ చిత్రం.. శుక్రవారం థియేటర్లలోకి దిగుతోంది. ప్రోమోలు చూస్తే ఆసక్తికరంగా అనిపించాయి. థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నట్లుంది. పబ్లిసిటీ కూడా గట్టిగా చేశారు.

ఈ సినిమా సింహాతో పాటు దర్శకుడు రితేష్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కెరీర్లకు కీలకం. మరోవైపు రాజ్ తరుణ్ నెల రోజుల వ్యవధిలో మూడో సినిమాతో రాబోతున్నాడు. పురుషోత్తముడు, తిరగబడరా సామీ చిత్రాలు అతడికి షాక్ మీద షాక్ ఇవ్వగా.. ఇప్పుడతను ‘భలే ఉన్నాడే’ మీద ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ మారుతి బ్రాండ్‌తో వస్తున్న సినిమా ఇది. శివసాయి దర్శకుడు. శృంగారం విషయంలో తడబడే కుర్రాడి పాత్రను పోషించాడు రాజ్ ఇందులో. ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ ఎంటర్టైనింగ్‌గానే అనిపిస్తోంది. మరి సినిమా ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

దీంతో పాటు కొత్త హీరో దిలీప్ ప్రకాష్ నటించిన ‘ఉత్సవం’ కూడా ఈ రోజే థియేటర్లలోకి దిగుతోంది. మరి యువ కథానాయకుల కెరీర్లకు కీలకంగా మారిన ఈ చిత్రం వారికెలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

This post was last modified on September 13, 2024 12:17 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

6 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

25 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

58 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago