ప్రస్తుతం విజయ్ దేవరకొండతో భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీనికన్నా ముందే ఇదే సితార ఎంటర్ టైన్మెంట్స్ లో మేజిక్ అనే చిన్న సినిమా చేశాడు. కొత్త తారలతో న్యూ ఏజ్ రామ్ కామ్ గా రూపొందింది.
షూటింగ్ పూర్తయినా జనవరిలో అనౌన్స్ మెంట్ ఇచ్చాక ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. లీడ్ క్యాస్టింగ్ ఉన్న ఒక పోస్టర్ తప్ప ఏ కంటెంట్ రిలీజ్ చేయలేదు. మళ్ళీ రావా, జెర్సీ లాంటి ఎమోషన్స్ తో పాటు పూర్తి స్థాయి కాలేజీ వినోదం ఇందులో జొప్పించారనే వార్తల నేపథ్యంలో యూత్ లో దీనికి మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
దీని జాడ లేకపోవడానికి పలు కారణాలున్నాయట. మొదటిది అనిరుధ్ రవిచందర్ పాటలు ఇచ్చినప్పటికీ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సంబంధించిన పనులు పూర్తి చేయాలి. కానీ అతనేమో క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నాయి.
ఎలాగూ విడి 12తో బిజీగా ఉన్న గౌతమ్ తిన్ననూరి బృందం మేజిక్ పనులు తర్వాత చూసుకుందామని పక్కన పెట్టారు. దీనికీ అనిరుదే మ్యూజిక్. ఇంకోవైపు సరైన విడుదల తేదీ ఈ ఏడాదిలో దొరకడం లేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా వరసగా పెద్ద రిలీజులున్నాయి. జనవరిలోనూ ఇదే పరిస్థితి. ఏదో మొక్కుబడిగా మేజిక్ రిలీజ్ చేసే ఉద్దేశం సితారకు లేదు.
మ్యాడ్ స్క్వేర్ కూడా నిర్మాణంలోనే ఉంది కాబట్టి అది కూడా పూర్తయ్యాక ఏది ముందు ఏది వెనుక అనేది డిసైడ్ చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ సినిమా రిలీజయ్యాక, అది బ్లాక్ బస్టర్ అయితే, అప్పుడు మేజిక్ ని వదలడం వల్ల బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వస్తుంది. ఎలాగూ అనిరుద్ బ్రాండ్ ఉంది కాబట్టి తమిళంలోనూ మార్కెట్ చేసుకోవచ్చు. ఈ లెక్కలన్నీ వేసుకునే మేజిక్ హడావిడి చేయకుండా సైలెంట్ గా ఉంది. ఇదే నిజమైతే మటుకు 2025 వేసవి దాకా ఎదురు చూడాల్సి రావొచ్చు. ఇన్ సైడ్ టాక్ అయితే అనిరుద్ బెస్ట్ ఆల్బమ్స్ లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
This post was last modified on September 13, 2024 10:10 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…