2025 సంక్రాంతికి బెర్తులు మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ఖరారు చేసుకున్న వాటిలో జనవరి 10 చిరంజీవి విశ్వంభరలో ఎలాంటి మార్పు లేదు. వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ కి డేట్ ఫిక్స్ చేయలేదు కానీ పండక్కు రావడం కోసం పక్కా ప్లాన్ తో ఉంది.
అజిత్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ రేసు నుంచి తప్పుకోవడం ఖాయమని చెన్నై టాక్. దాని స్థానంలో ఆలస్యమవుతూ వచ్చిన విదముయార్చిని తీసుకొస్తారని అంటున్నారు. ఎలా చూసుకున్న పొంగల్ ని మిస్ చేసుకునే ఉద్దేశంలో అజిత్ ఎంత మాత్రం లేడని అర్థమయ్యింది.
ఇదే సీజన్ కి రవితేజతో భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార సంస్థ నిర్మిస్తున్న ఎంటర్ టైనర్ తీసుకురావాలని ముందు అనుకున్నారు కానీ ఇదే షూటింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల మాస్ మహారాజా ఏకంగా రెండు నెలల దాకా రెస్టు తీసుకునే పరిస్థితి తలెత్తింది.
దీంతో పండక్కు రావడం దాదాపు లేనట్టేనని ఇన్ సైడ్ టాక్. అయితే బాలకృష్ణ 109 మాత్రం వచ్చేస్తోంది. డిసెంబర్ ప్రతిపాదన పక్కనపెట్టేసి జనవరి 9, 11, 12 తేదీలలో ఒకటి ఎంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని వీరమాస్ పేరు పరిశీలనలో ఉంది.
సో మొత్తానికి క్లారిటీ అయితే వస్తోంది. నవంబర్ నుంచే వీటి తాలూకు అప్డేట్స్ ప్రమోషన్స్ తో హడావిడి మాములుగా ఉండేలా లేదు. బాలయ్య 109కి దర్శకత్వం వహిస్తున్న బాబీ చాలా పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ తో ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఊపుమీదున్న బాలయ్యకు మరో ఘనవిజయం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. రవితేజ, బాలయ్య రెండు సినిమాలు ఒకే బ్యానర్ వే అయినప్పటికీ గతంలో మైత్రి చేసినట్టు ఒకేసారి రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యపడేలా లేదు.
This post was last modified on September 13, 2024 10:11 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…