పుష్ప 2 ది రూల్ షూటింగ్ అనుకున్న ప్రకారమే జరుగుతోంది కానీ మధ్యలో బ్రేకులు మాత్రం తప్పడం లేదు. ఆ మధ్య రష్మిక మందన్నకు చిన్న ప్రమాదం జరుగడంతో తన వరకు తీయాల్సిన భాగాన్ని పెండింగ్ ఉంచేసిన టీమ్ ఇప్పుడామె పూర్తిగా కోలుకోవడంతో మళ్ళీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ముప్పాతిక శాతం దాకా పూర్తయిన పుష్ప 2ని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6 విడుదల చేసే తీరాలనే సంకల్పం సుక్కు, బన్నీకి ఉంది. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్ అగ్రిమెంట్లకు సంబంధించిన వ్యవహారాలు ఆ డేట్ కి అనుగుణంగానే జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇక సుకుమార్ మనసులో ఆందోళన విషయానికి వస్తే పుష్ప 2లో ఐటెం సాంగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. పార్ట్ 1లో సమంతాని మించిన రేంజ్ లో ఎవరినైనా తేవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి కొలిక్కి రావడం లేదు. జాన్వీ కపూర్ ని ట్రై చేశారు కానీ దేవర, రామ్ చరణ్ 16 లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్న టైంలో స్పెషల్ సాంగ్స్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యారని టాక్. దిశా పటాని, కియారా అద్వానీ లాంటి వాళ్ళను అడిగారట కానీ కాల్ షీట్స్, పారితోషికాలు లాంటి కారణాల వల్ల ముందుకు వెళ్లలేదట. ఫైనల్ గా ఎవరు వస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఇంకో మూడున్నర నెలల సమయమే ఉండటంతో పుష్ప 2 టీమ్ పరుగులు పెట్టాలి. ప్రమోషన్ల కోసం ఎంతలేదన్నా ఒక నెల రోజులు కేటాయించుకోవాలి. అప్పుడే ఇతర మార్కెట్లలో రీచ్ పెరుగుతుంది. పైగా రెండు వారాల గ్యాప్ లో డిసెంబర్ 20 గేమ్ ఛేంజర్ వచ్చే సూచనలు పుష్కలంగా ఉండటంతో పుష్ప 2కి గ్రాండ్ ఓపెనింగ్ తో పాటు తగినన్ని స్క్రీన్లను అట్టి పెట్టుకోవడం అవసరం. పుష్ప 2కి టాక్ బాగా వస్తే చరణ్ మూవీతో ఇబ్బంది ఉండదు కానీ వీలైనంత మొదటి పదిరోజుల్లోనే రాబట్టేస్తే టెన్షన్ తగ్గిపోతుంది. ఇదంతా తర్వాత కానీ ముందు పుష్ప 2లో ఆడిపాడి ఐటెం గర్ల్ ఎవరవుతారో.
This post was last modified on September 12, 2024 2:39 pm
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…