ఇటీవలే విడుదలైన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఏదో విజయ్ ఇమేజ్ వల్ల తమిళనాడు, ఓవర్సీస్ లో వసూళ్లు రాబడుతోంది కానీ ఫ్యాన్స్ కే సినిమా నచ్చని మాట వాస్తవం. తెలుగు, మలయాళంలో దారుణంగా పోయిందని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ ఫ్లాప్ కి దర్శకుడు వెంకట్ ప్రభు విచిత్రమైన నిర్వచనం ఇవ్వడం షాక్ కి గురి చేస్తోంది. ఆయన లాజిక్ ప్రకారం క్లైమాక్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ రిఫరెన్స్ వాడటం వల్ల హిందీ, తెలుగు ఆడియన్స్ స్వంతం చేసుకోలేదని, అందుకే అపజయం కలిగి ఉండొచ్చని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో విన్న వాళ్ళ ఫ్యూజులు ఎగిరాయి.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే తాను సిఎస్కె వీర ఫ్యాన్ కావడం వల్లే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అభిమానులు నిత్యం ట్రోల్ చేస్తుంటారని, దాని వల్ల చేసేది ఏమి లేదని, తన రక్తంలోనే సిఎస్కె ఉన్నప్పుడు ఇది మారదని అన్నారు. నిజానికిది మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టిన అనాలసిస్. సినిమాలు ఏనాడూ క్రికెట్ వల్ల ప్రభావితం చెందినట్టు చరిత్రలో లేదు. అందులోనూ ఐపీఎల్ అనేది హైబ్రిడ్ టీమ్స్ ఆడే ఆట. ఇవాళ లక్నో టీమ్ లో ఉన్నోడు తర్వాత కేరళ బృందంలో చేరొచ్చు. ఎవరెవరో విదేశీయులు వస్తారు వెళ్తారు. ఇక్కడ దేశభక్తి, ప్రాంతీయత అనే ప్రశ్నే లేదు.
అలాంటప్పుడు గోట్ ఫ్లాప్ కి ఇలాంటి కారణం చెప్పడం వింతే. రాసుకుంటూ పోతే మహాభారతమంత లోపాలున్న గోట్ లో విజయ్ పెర్ఫార్మన్స్, భారీ నిర్మాణ విలువలు ఈ మాత్రం నెట్టుకొస్తున్నాయి కానీ లేదంటే యువన్ శంకర్ రాజా సంగీతానికి, ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయిన వెంకట్ ప్రభు దర్శకత్వానికి అన్ని చోట్ల ఒకే ఫలితం దక్కేది. తుపాకీ నుంచి లియో దాకా చూసుకుంటే విజయ్ కు ఇంత బ్యాడ్ టాక్ వచ్చిన సినిమా ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఒకటే. జరిగిన దాన్ని అంగీకరించకుండా దానికి ఐపీఎల్ ఫీలింగ్ తో ముడిపెట్టి ఏదో చెప్పాలనుకుంటున్న డైరెక్టర్ సాబ్ చివరికి ట్రోలింగ్ బారిన పడ్డారు.
This post was last modified on September 10, 2024 9:36 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…