ఈ నెల 7న వినాయక చవితి కానుకగా రావాల్సిన సినిమా.. జనక అయితే గనక. సుహాస్ హీరోగా సందీప్ రెడ్డి బండ్ల రూపొందించిన ఈ చిన్న చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఐతే రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతుండడంతో జనక అయితే గనకను చవితి వీకెండ్ రేసు నుంచి తప్పించారు. కొత్త డేట్ తర్వాత అనౌన్స్ చేస్తామన్నారు. చవితి వీకెండ్‌ను మిస్సయిన ఈ సినిమా.. మళ్లీ ఓ పండుగ వీకెండ్‌నే రిలీజ్ కోసం ఎంచుకోవడం విశేషం. వచ్చే నెల 12న దసరా పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. కొత్త డేట్‌ను ఆసక్తికర వీడియోతో రివీల్ చేశారు.
దసరాకు పోటీ కొంచెం గట్టిగానే ఉండబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అక్టోబరు 10నే విడుదల కానుండగా.. తర్వాతి రోజు గోపీచంద్ మూవీ విశ్వం వస్తుంది. ఆ మరుసటి రోజు, శనివారం జనక అయితే గనక థియేటర్లలోకి దిగుతుంది. మరో సినిమా ఏదైనా వచ్చినా ఆశ్చర్యం లేదు.
జనక అయితే గనక టీజర్, ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ మూవీలాగే కనిపిస్తోంది. ప్రస్తుత సామాజిక పరిస్థితుల దృష్ట్యా పిల్లలు కనడానికి భయపడే ఓ కుర్రాడి కథ ఇది. మరి ఈ ఆలోచనను దాటి అతను పిల్లల్ని కనేలా భార్య, సమాజం ఎలా ఒత్తిడి తెచ్చింది.. చివరికి ఎవరి ఆలోచన పైచేయి సాధించింది అన్నది మిగతా కథ.
కథల ఎంపికలో వినూత్నంగా సాగిపోతూ.. హీరోగా మంచి సక్సెస్ రేటే మెయింటైన్ చేస్తున్నాడు సుహాస్. ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన అంబాజీపేట మ్యారేజీబ్యాండు, ప్రసన్న వదనం మంచి ఫలితాలనే అందుకున్నాయి. ఈసారి దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత బేనర్లో చేసిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. సుహాస్ సరసన ఈ చిత్రంలో సంగీర్తన విపి న్అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించింది. వెన్నెల కిషోర్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మధ్య పెద్ద సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న రాజు.. ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు.
This post was last modified on September 10, 2024 9:32 am
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…