అనుభవజ్ఞులైన విక్రమ్ కుమార్, ఇంద్రగంటి మోహనకృష్ణలు నేచురల్ స్టార్ నాని ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయారు. గ్యాంగ్‍లీడర్ అయినా యావరేజ్ రిపోర్టులు తెచ్చుకుంది కానీ ‘వి’ మాత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురయింది. దీంతో నాని ఇక టాలెంటెడ్ యంగ్‍స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్సయ్యాడు. యువ దర్శకులకు తన రేంజ్ హీరో అవకాశమిస్తే వారికి అది ఖచ్చితంగా పెద్ద అఛీవ్‍మెంట్ అవుతుంది.
అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే దర్శకులుగా వారి భవిష్యత్తు బాగుంటుంది కనుక వారు మరింత ఎఫర్టస్ పెట్టి పని చేయడం గ్యారెంటీ. అందుకే నాని అలాంటి దర్శకులను ఐడెంటిఫై చేసి వాళ్లకు పెద్ద ప్లాట్‍ఫామ్ ఇస్తున్నాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‍తో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నాని చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత అతను ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్‍లో ఒక చిత్రం చేయనున్నాడు.
తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్‍తో కూడా ఒక సినిమా ఖాయం చేసుకున్నాడు. వరుసగా ఇంతమంది టాలెంటెడ్ యువ దర్శకులతో పని చేయనున్న నాని లైనప్ ఆసక్తికరంగా వుంది. వీటన్నిటి కంటే ముందుగా ‘టక్ జగదీష్’ షూటింగ్ పూర్తి చేస్తాడు. అక్టోబర్ మూడవ వారంలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నాని ‘శ్యామ్ సింగ రాయ్’ మొదలు పెట్టేస్తాడు.
This post was last modified on September 28, 2020 10:08 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…