కొన్ని సినిమాలు ఖచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తాయి. వాటిని ఓటిటిలో చూసినా, టీవీలో వీక్షించినా అంత కిక్ ఉండదు. కల్కి 2898 ఏడి ఒక మంచి ఉదాహరణ. అయితే సెప్టెంబర్ 13 రీ రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ మూవీ తుంబాడ్ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 2018లో విడుదలైన ఈ హారర్ డ్రామా అప్పటి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. స్వాతంత్రం రాక ముందు విసిరేసినట్టు ఉండే ఒక మారుమూల పల్లెటూరిలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు రహి అనిల్ బర్వే రూపొందించిన తీరు అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల మెప్పు పొందింది.
ఇంతకు ముందు అమెజాన్ ప్రైమ్ లో ఉన్న తుంబాడ్ తర్వాత అగ్రిమెంట్ పూర్తయిపోవడంతో ఎక్కడా అందుబాటులో లేదు. సామాన్య ప్రేక్షకులు చూడాలన్నా యూట్యూబ్ తో మొదలుపెట్టి ఏ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో దొరకడం లేదు. అయితే ఇప్పుడు భారీ ఎత్తున పునఃవిడుదలకి సిద్ధం చేయడంతో ఆడియన్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అప్పట్లో దీన్ని బిగ్ స్క్రీన్ మీద మిస్ అయిన వాళ్ళు బోలెడున్నారు. అసలు చూడకుండా కేవలం విన్నవాళ్ళ సంఖ్యకు లెక్కే లేదు. సో అందరికీ ఇప్పుడో ఛాన్స్ దొరికినట్టే. ఎందుకంటే మళ్ళీ డిజిటల్ లో వస్తుందన్న గ్యారెంటీ లేదు.
మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో ఒక పాడుబడిన గుహలో దెయ్యాల సంరక్షణలో అంతులేని బంగారు నాణేల నిధి ఉంటుంది. గోధుమ పిండిని ఎరగా వేస్తే రాకాసి భూతాలు తమ శరీరం నుంచి వాటిని వదలుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని వాడుకుని ఒకడు లక్షలు పోగేసుకుంటాడు. కొడుకుకి నేర్పించే క్రమంలో అత్యాశకు లోనై ఊహించని ప్రమాదాలను కొని తెచ్చుకుంటాడు. అదేంటో తెరమీద చూడాల్సిందే. ఇంతకుముందు ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులో ఉన్న తుంబాడ్ ని ఇప్పుడు ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారో మరి. ఇప్పటిదాకా చూడకపోతే మాత్రం హాలులోనే చూడాల్సిన బొమ్మ ఇది.
This post was last modified on September 6, 2024 5:50 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…
మొన్నటిదాకా టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించిన రాశిఖన్నా తెలుగు స్ట్రెయిట్ సినిమా చేసి రెండు సంవత్సరాలు దాటిపోయింది. నాగ చైతన్య…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై కూటమి నేతలు వర్సెస్ వైసీపీ అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతోంది.…
వరుణ్ తేజ్ మట్కా సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని గత 3 సినిమాలు బాక్సాఫీస్…