ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలిగా మారిపోయిన అలియా భట్ కొత్త సినిమా జిగ్రా అక్టోబర్ 11 విడుదల కానుంది. నిజానికి దీనికి ముందు అనుకున్న తేదీ అక్టోబర్ 2.
గాంధీ జయంతితో మొదలుపెట్టి దసరా సెలవుల దాకా లాంగ్ సీజన్ దొరుకుతుందనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేసుకున్నారు. అయితే దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27 వస్తున్న నేపథ్యంలో కేవలం వారం గ్యాప్ లో జిగ్రాని దించడం రిస్క్ అవుతుంది. ఎందుకంటే జిగ్రా నిర్మాతల్లో ఒకరైన ధర్మా ప్రొడక్షన్స్ హిందీ వెర్షన్ దేవరని నార్త్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది కనక సర్దుబాటు తప్పలేదు.
దీంతో తారక్ కోసం అలియా ఆలస్యంగా వస్తోందని ముంబై టాక్. అలాని జిగ్రాకి పోటీ లేదని కాదు. సౌత్ మార్కెట్ లో తీవ్రమైన కాంపిటీషన్ ఉంది. రజనీకాంత్ వెట్టయన్, గోపీచంద్ విశ్వం, ధృవ సర్జ మార్టిన్ లు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నాయి. ఇవి ఖచ్చితంగా అలియా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నాగ చైతన్య కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాళ ఒక కీలక పాత్ర చేయడం విశేషం. తోడబుట్టిన వాడి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదురుకునే పాత్రలో అలియా భట్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట.
స్త్రీ 2 నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలే చతికిలపడుతున్న టైంలో కేవలం కంటెంట్ ని నమ్ముకుని అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెట్టడం ఎవరూ ఊహించలేదు. అందుకే బయ్యర్లు కాంబినేషన్లను నమ్ముకోకుండా జనాల్లో అంచనాలు రేపిన వాటి మీదే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది రాకీ రాణికి ప్రేమ్ కహాని తర్వాత అలియా మళ్ళీ తెరపై కనిపించలేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒప్పుకున్న సినిమా ఆల్పా ఒకటే. ఇది స్పై థ్రిల్లర్. జిగ్రా అంతకు ముందే పూర్తయ్యింది. తర్వాత బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవా ఉంటుంది.
This post was last modified on September 6, 2024 5:42 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…