రేపు విడుదల కాబోతున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మీద తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో తక్కువ హైప్ ఉండటం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. కాంబోలతో సంబంధం లేకుండా మాములుగా విజయ్ సినిమా అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేస్తుంది. అందులోనూ ఏపీ తెలంగాణలో తుపాకీ నుంచి లియో దాకా అతని మార్కెట్ అంతకంతా పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. కానీ గోట్ విషయంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండటం షాక్ కలిగిస్తోంది. ఇక బిసి సెంటర్స్ లో ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. కౌంటర్ సేల్స్ మీదే ఆధారపడాలి.
దర్శకుడు వెంకట్ ప్రభు బ్రాండ్, యువన్ శంకర్ రాజా ఇచ్చిన వీక్ ఆల్బమ్, అంచనాలు పెంచని ట్రైలర్ ఇవన్నీ గోట్ కు ప్రతికూలంగా మారాయి. వీటిని పక్కనపెడితే ఈ ప్యాన్ ఇండియా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లని ట్రేడ్ రిపోర్ట్. ఇంత మొత్తం రావాలంటే మాములు టాక్ వస్తే సరిపోదు. విక్రమ్, జైలర్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలి. ఆ రెండూ రిలీజ్ కు ముందు బజ్ పెంచుకున్నవి. గోట్ కు ఆ సానుకూలత లేదు. పైగా ఎప్పటిలాగే విజయ్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించడంతో ఎక్కువ శాతం ప్రేక్షకుల దృష్టిలో పడలేదు.
సో గోట్ ముందు పెద్ద సవాల్ ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో హైదరాబాద్ లో తెల్లవారుఝామున 4 గంటలకు స్పెషల్ షోలు వేయడానికి అనుమతులు తెచ్చుకున్నారు. కొంచెం ఆలస్యమైనా పర్మిషన్లు అయితే వచ్చేశాయి. వీటికి వచ్చే టాక్ చాలా కీలకం కానుంది.. విజయ్ డ్యూయల్ రోల్ చేసిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవా, ప్రశాంత్, మౌనరాగం మోహన్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. బడ్జెట్ కూడా రెండు వందల కోట్లకు పైగా పెట్టారట. ట్విస్ట్ ఏంటంటే విజయ్ ఎక్స్ హ్యాండిల్ లో ఆగస్ట్ 17 తర్వాత ఎలాంటి అప్డేట్ లేకపోవడమే. రిలీజ్ పోస్టర్ కూడా పంచుకోలేదు.
This post was last modified on September 4, 2024 5:31 pm
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…
కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన…
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…