గత దశాబ్ద కాలంలో నెమ్మదిగా తెలుగులో మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఒకప్పుడు తన సినిమాలు తెలుగులో రిలీజవ్వడమే గగనం అన్నట్లుండేది పరిస్థితి. కానీ గత కొన్నేళ్లలో తన క్రేజ్, మార్కెట్ పెరుగుతూ వచ్చాయి. ‘లియో’ సినిమాకు అవి పీక్స్‌కు చేరాయి.
‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం కూడా ప్లస్ అయి ‘లియో’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది. విడుదలకు రెండు రోజుల ముందే చాలా షోలు అడ్వాన్స్ ఫుల్స్ అయిపోయాయి. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నడూ లేని విధంగా విజయ్ సినిమాకు అర్లీ మార్నింగ్ షోలు కూడా పడ్డాయి ఆ చిత్రానికి. అవన్నీ కూడా కూడా అడ్వాన్స్ ఫుల్సే. విజయ్‌కి తెలుగులో ఇంత క్రేజేంటి అని అందరూ షాకైపోయిన పరిస్థితి.
‘లియో’ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చినా సరే.. ప్రి రిలీజ్ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకుంది. భారీ ఓపెనింగ్స్‌తో వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కానీ ఇప్పుడు విజయ్ కొత్త సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’కు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. నిన్ననే ‘గోట్’కు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
బోలెడన్ని థియేటర్లు, షోలు ఇచ్చారు కానీ.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. టికెట్ల అమ్మకాలు మొదలై సగం రోజు గడిచినినా బుక్ మై షోలో ఎటు చూసినా గ్రీన్ కలరే కనిపిస్తోంది. ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు పెద్దగా కనిపించడం లేదు. ఇక సోల్డ్ ఔట్ పరిస్థితి అసలే లేదు. ‘గోట్’ విషయంలో ఎందుకో మేకర్స్ ముందు నుంచి ప్రమోషన్ల పరంగా హడావుడి చేయట్లేదు. ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా అనిపించిందంతే. ఐతే కంటెంట్ మీద టీం చాలా నమ్మకంతో ఉంది. ప్రస్తుతానికైతే తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ‘లియో’తో దీనికసలు పోలికే లేదు. సినిమాకు టాక్ బాగుంటే కథ మారుతుందేమో చూడాలి.
This post was last modified on September 4, 2024 9:23 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…