లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుటుంబంలో సంగీతంతో అనుబంధం ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఆయన సోదరుడు గంగై అమరన్ సంగీత దర్శకుడే. కొడుకు యువన్ శంకర్ రాజా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే.
ఇళయరాజా తనయురాలైన దివంగత భవతారిణి గాయని, సంగీత దర్శకురాలు. ఆమె కొన్ని నెలల కిందటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన సంగతి తెలిసిందే. అయినా సరే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) ఆమెతో పాడించాలనుకున్న పాటను ఏఐ సాయంతో పూర్తి చేసినట్లు దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించాడు. గంగై అమరన్ తనయుడైన వెంకట్‌కు కూడా భవతారిణి సోదరే అవుతుంది. ఈ అనుభవం గురించి మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో వెంకట్ భావోద్వేగానికి గురయ్యాడు.
గోట్ మూవీలో కోసం కంపోజ్ చేయాలనుకున్న చిన్న చిన్న కంగళ్ సాంగ్ థీమ్ గురించి యువన్ నాకు చెప్పాడు. ఆ పాటను భవతారిణితో పాడించాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ సమయంలో తను అనారోగ్యంతో ఉంది. కోలుకుని చెన్నై వచ్చాక పాడతారనుకున్నాం. ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె మరణించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ‘లాల్ సలామ్’ సినిమాలోని ఓ పాటలో దివంగత గాయకుడు రాహుల్ హమీద్ గాత్రాన్ని వినిపించినప్పుడు.. మనమెందుకు అలా చేయకూడదని యువన్‌ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీంను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా వాయిస్ తీసుకుని, మరో సింగర్ ప్రియదర్శిని సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్‌పుట్ తీసుకురాగలిగాం. ట్యూన్ బాగా నచ్చడంతో స్వయంగా విజయ్ ఈ పాటలో భాగమవుతానన్నారు. అలా విజయ్, భవతారణిల గాత్రంతో రూపొందిన ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది అని వెంకట్ ప్రభు వెల్లడించాడు. భవతారిణి తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో’నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాట పాడింది. ఆమె గతంలో ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.
This post was last modified on September 4, 2024 10:50 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…