పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా దర్శకుడు అట్లీతోనేనని, సన్ పిక్చర్స్ నిర్మాణంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుందని ఎప్పుడో నెలల క్రితం వచ్చిన టాక్ మళ్ళీ నాలుగైదు రోజుల నుంచి ఊపందుకుంది. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదనే లీక్ కూడా గతంలోనే వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అట్లీ నెక్స్ట్ తీయబోయేది బాలీవుడ్ లోనే. షారుఖ్ ఖాన్ జవాన్ తర్వాత తన పేరు అమాంతం జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోవడంతో దాన్ని పెంచుకునే దిశగా ప్లాన్ చేస్తున్నాడు.
ముంబై రిపోర్ట్స్ ప్రకారం అట్లీ, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలయికలో మూవీ ఓకే అయిపోయింది. ఫైనల్ వెర్షన్ ఇటీవలే వినిపిస్తే సల్లు భాయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనికి ఇద్దరు హీరోల అవసరం ఉండటంతో లోక నాయకుడు కమల్ హాసన్ ని ఇందులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిసింది. పాత్ర నచ్చి కల్కి 2898 ఏడిలో విలన్ గా నటించేందుకు వెనుకాడని కమల్ ఇప్పుడు సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎందుకు వద్దంటారు. ఇవన్నీ కొలిక్కి వచ్చి సెట్స్ పైకి వెళ్ళడానికి 2025 జనవరి కావొచ్చని వినికిడి. సో ఇంకా నాలుగు నెలలు టైం ఉంది.
మరి బన్నీ ఎవరితో చేస్తాడనే దాని గురించి మాత్రం ఇంకొంత కాలం సస్పెన్స్ తప్పదు. కొత్త స్టోరీలు కాకపోయినా మాస్ కి ఇచ్చేలా కమర్షియల్ కథలను హ్యాండిల్ చేయడంతో దిట్టగా పేరు తెచ్చుకున్న అట్లీతో బన్నీ కాంబో ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే అల్లు అర్జున్ తర్వాతి లిస్టులో ఎలాగూ త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు కాబట్టి అట్లీది మిస్సయినా పెద్దగా బాధ పడేందుకు లేదు కానీ ఏడాదికి ఒక సినిమా అయినా అల్లు అర్జున్ నుంచి రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కి ఆ కోరిక అంత సులభంగా తీరేలా లేదు. ఎంచుకుంటున్న గ్రాండియర్లు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.
This post was last modified on September 2, 2024 3:29 pm
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…