నిన్న జరిగిన బాలకృష్ణ యాభైయ్యవ నట స్వర్ణోత్సవ వేడుక కనులపండలా జరిగింది కానీ కొన్ని అంశాల్లో పక్కనపెట్టలేనివి ఉన్నాయి. మొదటిది అక్కినేని నాగార్జున గైర్హాజరు. బిగ్ బాస్ సీజన్ 8 షూటింగ్ కారణమని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెబుతున్నప్పటికీ కాసేపు వచ్చి వెళ్లి ఉంటే బాగుండేదనే అభిప్రాయం జనంలో లేకపోలేదు.
ఇద్దరి మధ్య విభేదాల గురించి ఆ మధ్య కొన్ని ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. వాటికి ప్యాచ్ జరిగేలా ఈ సెలబ్రేషన్ ఉపయోగడుతుందని అందరూ అనుకున్నారు. కానీ కుదరలేదు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఉన్న అరుదైన ఫ్రేమ్ లో మిస్సయ్యింది నాగే.
ఇక రెండో విషయం జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం. తల్లి, భార్యతో కలిసి కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనలో తారక్ బిజీగా ఉన్నాడు. మిత్రులు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ తో కలిసి దర్శననీయ స్థలాలను చుట్టేస్తున్నాడు. ఎప్పటికప్పుడు వాటి ఫోటోలను, వీడియోలను క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు ఇస్తున్నాడు. నిజానికి ఈ ట్రిప్ తర్వాతయినా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బాలయ్య 50 జరుగుతున్న టైంలోనే వెళ్లడం చూస్తే ఈవెంట్ కు అసలు ఆహ్వానం వెళ్లిందా లేదానే అనుమానాలు ఫ్యాన్స్ లో తలెత్తుతున్నాయి. అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా కనిపించకపోవడం వీటికి మరింత బలం చేకూర్చింది.
ఇక చివరి క్షణం వరకు వస్తాడని ప్రచారం జరిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కమిటీ సభ్యులు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని వద్దన్నారా లేక వేరే రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేం.
కారణాలు ఏమైనా నాగ్, తారక్, బన్నీ లేకపోవడం కొంత లోటుగా అనిపించిన మాట వాస్తవం. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వచ్చి ఉంటే బాగుండేది కానీ స్థానికంగా అందుబాటులో లేని కారణంగా సాధ్యపడలేదు కాబట్టి ప్రత్యేకంగా ఎంచి చూపించలేం.
ఎందరో దర్శకులు, కొత్త తరం హీరోలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన శివ రాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఇలా మల్టీస్టారర్ సంబరంగా అనిపించినా క్షణాల్లో ఈ ముగ్గురు ఉంటే ఇంకా నిండుగా ఉండేది. ఈ నెల 22న ఏపిలో బాలయ్య కోసం మరో స్వర్ణోత్సవం చేస్తున్నారనే టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ముందు వచ్చిన వారందరినీ చూడలేం కానీ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలతో పాటు మిస్సయిన మరికొందరు వస్తారేమో వేచి చూడాలి.
This post was last modified on September 2, 2024 2:10 pm
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు.…
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…
ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…