ఏదైనా సినిమాకు ముందు రోజు ప్రీమియర్లు వేయాలంటే నిర్మాతలకు టెన్షన్ తోనే తల బద్దలైపోతోంది. ఎంతో నమ్మకంతో తీసుంటారు కానీ ఏ మాత్రం తేడా వచ్చినా అర్ధరాత్రి దాటే లోపే టాక్ డ్యామేజ్ చేస్తోంది. ఇటీవలే మిస్టర్ బచ్చన్ ఈ తప్పు చేయడం వల్ల ఓపెనింగ్స్ ప్రభావితం చెంది డిజాస్టర్ టాక్ ని మరింత వేగంగా పాకేలా చేసింది. అలాని అందరికీ ఇలా జరగలేదు. గతంలో మేజర్, 777 ఛార్లీ, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్లు ఒక రోజు ముందే స్పెషల్ షోలతో బ్రహ్మాండమైన లబ్ది పొందాయి. ఇటీవలే కమిటీ కుర్రోళ్ళు లాంటి చిన్న చిత్రం ఈ సాహసం చేసి సూపర్ హిట్ కి దారులు వేసుకుంది.
ఆయ్ తీసిన కుర్రకారు సైతం ఇదే ఫార్ములా వాడి ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. వీళ్ళిచ్చిన స్ఫూర్తితో 35 చిన్న కథ కాదు సైతం ఎర్లీ ప్రీమియర్లకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు రెండు రోజులు ముందే అంటే నాలుగు, అయిదు తేదీల్లో షోలు వేయబోతున్నారు. హైదరాబాద్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇతర ప్రధాన కేంద్రాల్లో వేసే ఆలోచన చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన నిర్ణయం రేపో ఎల్లుండో వెలువడనుంది. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన 35 చిన్న కథ కాదుకి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఇంత ధైర్యంతో ముందెకెళ్తున్నారంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే. ఒకరకంగా ఇది మంచి స్ట్రాటజీ. ఎందుకంటే వినాయకచవితికి పోటీ గట్టిగానే ఉంది. అయిదున విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, ఏడున సుహాస్ జనక అయితే గనకతో పాటు రాజ్ తరుణ్ భలే ఉన్నాడే థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. తమిళ డబ్బింగ్ మూవీని పక్కనపెడితే మిగిలినవన్నీ చిన్న బడ్జెట్ తో రూపొందినవే. ఈ మధ్య సినిమా బాగుంటే చాలు కొత్తా పాత ఆర్టిస్టుల తేడా ప్రేక్షకులు ఆదరిస్తున్న తరుణంలో 35 చిన్న కథ కాదు ఆ ధైర్యంతోనే అడుగులు వేస్తోంది. ట్రైలర్ హోమ్లీగా, ఆకట్టుకునేలా కట్ చేయడం హైప్ తెచ్చేలా ఉంది.
This post was last modified on %s = human-readable time difference 11:49 am
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…