ప్రభాస్ సినిమాతో ఫేడ్ అవుట్ అయిపోయింది!

సాహో రిలీజ్ కి ముందు శ్రద్ధ కపూర్ మీద తెలుగు ఇండస్ట్రీ చాలా ఆసక్తి చూపించింది. తెలుగు సినిమాలో నటిస్తోంది కనుక ఇక ఆమెని టాలీవుడ్ కి పర్మనెంట్ గా తీసుకొచ్చేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే సాహో అనూహ్య పరాజయం పాలవడం, మన ప్రేక్షకులకి శ్రద్ధ అంతగా నచ్చకపోవడంతో ఆమె కోసం ప్రయత్నాలు తగ్గిపోయాయి.

బాలీవుడ్ హీరోయిన్ అవసరం అనుకున్న సినిమాలకి కూడా ఆమె పేరు పరిశీలించడం లేదంటే శ్రద్ధ మీద శ్రద్ధ లేదని స్పష్టమవుతోంది. ఆ సినిమా హిట్ అయి వుంటే ఆమె డిమాండ్ వేరేలా ఉండేది. అసలే పెద్ద హీరోల సినిమాలకి ఇప్పుడు పూజ హెగ్డే, రష్మిక తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

అందుకే కొన్ని సినిమాలకి హిందీ హీరోయిన్లు దొరుకుతారేమో అని ప్రయత్నాలు చేస్తున్నారు. సాహో కోసం ఎవరెవరినో అనుకుని చివరకు శ్రద్ధతో సెటిల్ అయ్యారు. అనుకోకుండా కలిసి వచ్చిన అవకాశం ఆమెకి అదృష్టంగా మారలేదంతే పాపం!