ఎల్లుండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న గబ్బర్ సింగ్ ఎన్నో విశేషాలను వెలికి తీస్తోంది. ఇవాళ జరిగిన ప్రీ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. అందులో ఈ సినిమా వెనుక ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం గురించి కూడా ఉంది. నిర్మాత బండ్ల గణేష్ దాన్ని వివరించారు. దబాంగ్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు తీన్ మార్ షూటింగ్ సమయంలో సోను సూద్ దాన్ని కొనమని సూచించడంతో హీరోకు చెప్పకుండా గణేష్ హక్కులను తీసుకుని వచ్చారు. అయితే పవన్ కళ్యాణే నిర్మాతగా దాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేసుకుని ఫోటో షూట్ చేశారు.
తర్వాత ఒక రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బండ్ల గణేష్ ని పిలిచి ఇది నువ్వే ప్రొడ్యూసర్ గా చేసుకోమని చెప్పగానే అలా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఆయన చెప్పకపోయినా దీని వెనుక మరో కోణం కూడా ఉంది. 2011లో తీన్ మార్ ఫెయిలయ్యింది. నిర్మాతగా బండ్ల బ్యానర్ కు ఇది పెద్ద కుదుపు. ఆ సినిమాకు రచయితగా సంభాషణలు రాసింది త్రివిక్రమే. దాని వల్ల నష్టపోయాడు కాబట్టి మళ్ళీ రికవర్ కావాలంటే ఇంకో హిట్ సినిమా పడాలనే ఉద్దేశంతో గబ్బర్ సింగ్ తిరిగి ఇతని చేతిలో పెట్టారు. కట్ చేస్తే అది అంచనాలకు మించి ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టేసింది.
పవన్ ఎన్ని సినిమాలు చేసినా గబ్బర్ సింగ్ మాత్రం అభిమానులకు చాలా స్పెషల్ గా నిలిచిపోయింది. అంత ఎనర్జీతో ఆయనని చూసిన ఆడియన్స్ థియేటర్లలోనే డాన్సులు చేశారు. సినిమాని ఎంజాయ్ చేశారు. ఇప్పుడు రీ రిలీజ్ వేళ టికెట్ల కోసం ఏర్పడుతున్న డిమాండ్ చూస్తుంటే సరికొత్త మైలురాళ్ళు నమోదు కావడం ఖాయమే అనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గతంలో అసందర్భంగా చేసిన కొన్ని కామెంట్లకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిన బండ్ల గణేష్ తన బ్రతుకుకో పరమార్థం కలిగించిన సంఘటన ఇదేనని గబ్బర్ సింగ్ నిర్మాణం వెనుక ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
This post was last modified on August 31, 2024 4:21 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…