బ్యాలన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు షూటింగ్ వెళ్తాయో ఖచ్చితమైన డేట్లు రాలేదు కానీ అతి త్వరలో అనే శుభవార్త ఫ్యాన్స్ కు చేరిపోయింది. వీటిలో అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఓజి అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే వచ్చినప్పటికీ అంచనాల పరంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు టాలీవుడ్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుగుతుందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇదిలా ఉండగా మార్చి 27 ఓజి విడుదల చేయాలనే ప్లాన్ లో నిర్మాత డివివి దానయ్య ఉన్నట్టు వచ్చిన టాక్ విజయ్ దేవరకొండకు షాకే.
ఎందుకంటే రౌడీ బాయ్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న విడి 12కి అఫీషియల్ రిలీజ్ డేట్ మార్చి 28ని ఆల్రెడీ ప్రకటించారు. ఇది జరిగి వారాలు దాటిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా ఓజి వస్తే పోటీ పడేందుకు లేదు. ఎందుకంటే విడి 12 నిర్మాత నాగ వంశీ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో క్లాష్ కి సిద్ధపడరు. స్వయంగా ఆయనే ఆ మాట పలుమార్లు చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం వద్దనే అంటారు. ఒకవేళ ఓజి నిజంగా మార్చి 27 వచ్చే పక్షంలో విజయ్ దేవరకొండ మూవీ తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదు.
తేదీ అయితే అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లు, పనులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పక్కాగా ఒక ప్లాన్డ్ షెడ్యూల్ పాటించే పరిస్థితి లేదు. సమీక్షలు, సమావేశాలు ముందస్తుగా చెబుతారు కానీ ప్రకృతి విపత్తులు, సంఘటనలు చెప్పి రావు, జరగవు. అలాంటప్పుడు అప్పటికప్పుడు వాటికి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఓజి షూటింగ్ అయిపోయింది, గుమ్మడికాయ కొట్టారు అనే శుభవార్త విన్నాకే మిగిలిన నిర్మాతలు డెసిషన్లు మార్చుకోవచ్చు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విడి 12 మీద విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు.
This post was last modified on August 31, 2024 5:10 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…