విడుదలకు ఇంకా 27 రోజులు ఉండగానే దేవర పార్ట్ 1 వసూళ్ల ఊచకోత ఓవర్సీస్ లో మొదలైపోయింది. పక్కా ప్రణాళికతో నాలుగు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. గంటల వ్యవధిలో యుఎస్ టికెట్ అమ్మకాల ద్వారా 80 వేల డాలర్ల మైలురాయిని దాటడమే వేగంగా మిలియన్ వైపు పరుగులు పెడుతోంది. రిలీజ్ నాటికి ఖచ్చితంగా రెండున్నర మిలియన్ డాలర్లు నమోదు చేస్తుందని బయ్యర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టే దేవర మీద బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. స్క్రీన్లు క్రమంగా పెంచుతున్నారు.
సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి అయిదేళ్ళు దాటిపోవడంతో అభిమానుల ఆకలి అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ ఎంత హిట్టయినా ఆ క్రెడిట్ ని రాజమౌళి, రామ్ చరణ్ తో పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ చూపు దేవర మీదే ఉంది. కొరటాల శివ గత డిజాస్టర్ ఆచార్య ప్రభావం దీని మీద ఇనుమంతైనా లేకపోవడం గమనార్హం. దానికి బదులు జనతా గ్యారేజ్ కాంబోగానే ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది. ప్లానింగ్ విషయంలో ఎక్కడా తడబాటు లేకుండా, చివరి నిమిషం హడావిడి జరగకుండా దేవర మేకర్స్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అమెరికాతో పాటు సమాంతరంగా ఇండియాలోనూ ఒకే టైంకి ప్రీమియర్లు పడేలా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి షోలు వేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు కూడా ఇక్కడ 4 నుంచి స్టార్టయ్యాయి కానీ మిడ్ నైట్ బెనిఫిట్ షోలు వేయలేదు. కానీ దేవర టీమ్ నమ్మకం వేరే లెవెల్ లో ఉంది. ఒకేసారి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందనే ధీమాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి అనుమతులకి ఇంకా సమయముంది కానీ సానుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on August 31, 2024 11:00 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…