ఈ మధ్య ఏదో ఒక ప్రత్యేకత లేనిదే ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను చూడటం లేదు. అందుకే నిజ జీవిత సంఘటనలను దర్శకులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సర్వైవల్ డ్రామా ఐసి 814 ది కాందహార్ ఎటాక్. 1999లో దేశాన్ని కుదిపేసిన విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందించారు. అరవింద్ స్వామి, నసీరుద్దీన్ షా, విజయ్ వర్మ, పంకజ్ కపూర్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది. సగటు ఒక్కోటి నలభై అయిదు నిమిషాలతో మొత్తం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఐసి 814ని ప్రత్యేకంగా ఎందుకు చూడాలనే పాయింట్ కొద్దాం.
90 దశకంలో భారతదేశం అణుపరీక్షలు నిర్వహించడం పాకిస్థాన్ తో పాటు అమెరికా, చైనా లాంటి దేశాలకు కంటగింపుగా మారుతుంది. కార్గిల్ విజయం దీనికి మరింత ఆజ్యం పోస్తుంది. అంతర్జాతీయ తీవ్రవాద నాయకుడిని మన ఆఫీసర్లు పట్టుకోవడంతో అతని ఎలాగైనా విడిపించాలంటే లక్ష్యంతో నేపాల్ లో ఉండే కొందరు టెర్రరిస్టులు కుట్ర పన్నుతారు. కాట్మండు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ ని హైజాక్ చేసి దాన్ని అమ్రిత్సర్, దుబాయ్ మీదుగా కాందహార్ తీసుకెళ్తారు. తమ డిమాండ్లను ఇండియన్ గవర్నమెంట్ ముందు ఉంచుతారు. 170 ప్రాణాలను అప్పటి సర్కారు ఎలా కాపాడిందనేది స్టోరీ.
నాగార్జున గగనం తరహాలో అనిపించినప్పటికీ ఐసి 814 చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. మనకు తెలియని ఎన్నో విషయాలను వివరిస్తూనే స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకులు అనుభవ్ సిన్హా, త్రిశాంత్ సక్సెసయ్యారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మరింత విలువను పెంచింది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీసుకున్న శ్రద్ధ, ఆర్ట్ వర్క్, విఎఫెక్స్ ఆకట్టుకుంటాయి. అయితే సగటు కమర్షియల్ యాంగిల్ లో థ్రిల్స్, ఎంటర్ టైన్మెంట్ ఆశిస్తే మాత్రం ఐసీ 814 మీ కప్పు కాఫీ కాదు. ఊకదంపుడు మసాలా కంటెంట్ తో విసిగిపోయి ఉంటే ఇది ట్రై చేయొచ్చు. కాలక్షేపం, జ్ఞానం రెండూ ఇస్తుంది.
This post was last modified on August 30, 2024 5:55 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…