అవకాశాలు వస్తున్నా సినిమాలు చేయడంలో మెల్లగా అడుగులు వేస్తున్న ప్రియాంకా మోహన్ ఇప్పటిదాకా తెలుగులో చేసినవి మూడే. మొదటిది నాని గ్యాంగ్ లీడర్. అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యింది. మంచి కాంబో, క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నా లాభం లేకపోయింది. రెండోది శర్వానంద్ శ్రీకారం.
ఇది కూడా మంచి హైప్ తో వచ్చి నిరాశపరిచింది. శివ కార్తికేయన్ తో తమిళ డబ్బింగులు కాలేజీ డాన్, వరుణ్ డాక్టర్ లు హిట్టయ్యాయి కానీ స్ట్రెయిట్ మూవీ సక్సెస్ రాలేదనే లోటు మాత్రం ఉండిపోయింది. ఇప్పుడా కొరత సరిపోదా శనివారం తీర్చేసినట్టు కనిపిస్తోంది.
నిన్న విడుదలైన ఈ మూవీకొచ్చిన పాజిటివ్ టాక్ హిట్ వైపుకు తీసుకెళ్తోంది. సినిమా మొత్తం ప్రియాంకా మోహన్ ఉన్నా ఎక్కడ గ్లామర్ షోకు అవకాశం లేకుండా, కొన్ని సీన్లు పాట మినహాయించి మొత్తం కానిస్టేబుల్ డ్రెస్సులోనే చూపించడం ఈ మధ్య కాలంలో అరుదనే చెప్పాలి.
నిజానికి తనకు ఛాన్సులు తక్కువ రావడానికి కారణం ఎక్స్ పోజింగ్ కి నో చెప్పడమేనని చెన్నై మీడియాలో టాక్ ఉంది. సూర్యలాంటి అగ్ర హీరోతో చేసినా అవకాశాలు క్యూ కట్టలేదు. ప్రస్తుతం తన చేతిలో ఉన్నది జయం రవి బ్రదర్ ఒకటే. ఇది షూటింగ్ పూర్తి చేసుకుని తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ రెడీ అవుతోంది.
అసలైన కిక్ ఇచ్చేది మాత్రం పవన్ కళ్యాణ్ ఓజినే. దాని మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో చూస్తున్నాం. అభిమానులు ఎక్కడికి వెళ్లినా ఓజి నామస్మరణతో హోరెత్తిస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ వచ్చే సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని ఇప్పటికే హైప్ ఆకాశాన్ని దాటుతోంది. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే ప్రియాంకా మోహన్ దశ తిరిగినట్టే. టాలీవుడ్ నుంచి పిలుపులు పెరుగుతాయి. ఎలాగూ పవన్ తో చేసింది కాబట్టి మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ, తారక్ లాంటి వాళ్ళతో జట్టు కడితే ఇక్కడ హీరోయిన్ల కొరత ఉన్న గ్యాప్ ని బాగా వాడుకోవచ్చు.
This post was last modified on August 30, 2024 11:09 am
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…