ఒకప్పుడు స్వీయ నిర్మాణంలో లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు లాంటి బ్లాక్‌బస్టర్లు తీసి సాహసోపేతమైన ఫిలిం మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు వైవీఎస్ చౌదరి. ఆ సినిమాలను ఆయన ఎంతో రిస్క్ చేసి, అందులోని హీరోల మార్కెట్ పరిధిని మించి ఖర్చు పెట్టి తీశాడు. వాటికి గొప్ప ఫలితం వచ్చింది.
కానీ ఇలాగే రిస్క్ చేసిన తీసిన ‘రేయ్’ మాత్రం వైవీఎస్‌కు తీరని నష్టాలు మిగిల్చి ఆయన కెరీర్‌కు దాదాపుగా ఎండ్ కార్డ్ వేసినట్లు కనిపించింది. కొన్నేళ్ల పాటు వాయిదాల మీద వాయిదాలు పడి 2015లో రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో దర్శకుడిగా ఎన్నడూ లేనంత విరామం వచ్చింది వైవీఎస్‌కు. ఇక మళ్లీ ఆయన సినిమా తీయడు అనుకున్న టైంలో ఇటీవలే ‘న్యూ టాలెంట్ రోర్స్’ (ఎన్‌టీఆర్) అనే బేనర్ పెట్టి కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి తన బేనర్లో నందమూరి జానకిరామ్ తనయుడైన మరో ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన వైవీఎస్ తాజాగా ఈ సినిమా కథాంశం గురించి చెప్పడానికి మరో ప్రెస్ మీట్ పెట్టారు.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సినిమా తీయబోతున్నట్లు చెప్పిన వైవీఎస్.. ఈ కథ 1980 నేపథ్యంలో నడుస్తుందని తెలిపాడు. తనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, దాని గొప్పదనాన్ని కొత్త తరానికి చెప్పాలని అనుకున్నానని.. ఎట్టకేలకు అందుకు తగ్గ మంచి కథ దొరికిందని చౌదరి చెప్పాడు.
సినిమాలో తెలుగు భాషతో పాటు హైందవ సంస్కృతి గొప్పదనాన్ని చూపిస్తానని.. ఈ సినిమాకు ఆ నేపథ్యమే బలమని ఆయన అన్నాడు. తన హీరో ఎన్టీఆర్‌ను గత ఏడాది ఏప్రిల్ 27న కలిశానని.. ఈ కథ చెప్పాక అందుకు అనుగుణంగా అతను తయారయ్యాడని.. హీరోయిన్ కూడా తెలుగమ్మాయే అని.. ఆమె కూచిపూడి డ్యాన్సర్ అని చెప్పాడు చౌదరి.
This post was last modified on August 29, 2024 10:33 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…