ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో వ్యక్తి ఎవరైనా సరే నలుగురిలో వైరల్ టాపిక్ కావాలంటే అసందర్భ కామెంట్లో లేదా ప్రసంగమో చేస్తే సరి. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ ని ఉద్దేశించి అన్న మాటలు ఎంత దూరం వెళ్ళాయో చూస్తున్నాం. అది తప్పని చెప్పిన ప్రముఖులు పదులు, వందల్లో కనిపిస్తున్నా సదరు మహానుభావుడికి మాత్రం కనీసం సారీ చెప్పాలని లేదా వివరణ ఇవ్వాలని అనిపించలేదు. ఇప్పుడీ వరసలో కాదు కానీ ఇంకో రకంగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పాపులారిటీ కోరుకుంటున్నాడు.
గత ఏడాది రిలీజైన ఆదిపురుష్ ఎంత డిజాస్టరో చెప్పనక్కర్లేదు. చెప్పుకోవడానికి నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది కానీ నిజానికి దాని స్టామినా అది కాదు. రామాయణ గాథని అంచనాలకు తగ్గట్టు చూపించి ఉంటే కనీసం వెయ్యి కోట్లు దాటేది. ఊరూరా జాతరలాగా జనం థియేటర్లకు వచ్చేవారు. నెగటివ్ క్రిటిసిజం ఎంత వచ్చిందో అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. కానీ ఓం రౌత్ ఒప్పుకోవడం లేదు. హిట్ కొలమానం బాక్సాఫీస్ కలెక్షన్లు కాబట్టి ఆదిపురుష్ స్థాయి ఏంటో మీరే నిర్ణయించుకోండని మెలిక పెట్టాడు. ముక్కుమొహం లేని ఆన్ లైన్ ట్రోలింగ్ పట్టించుకోను అన్నాడు.
ఇంతే కాదు ప్రభాస్ హిట్టు ఫ్లాపుకు అతీతమైన హీరో అని పనిలో పనిగా ప్రశంసలు గుప్పించాడు. అయినా పొరపాటు జరిగింది అలా తీయకుండా ఉండాల్సిందని తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉండేది. అది వదిలేసి వందల కోట్లు వచ్చాయని సాకుగా చూపించడం అసలు కామెడీ. ప్రభాస్ ఇమేజ్ ఆ వసూళ్లలో ఎంత కీలక పాత్ర పోషించాయో వేరే చెప్పనక్కర్లేదు. అయినా అపజయాన్ని ఒప్పుకోవడం ఒక కళ. అది అందరికీ రాదు. అన్నట్టు ఆదిపురుష్ తర్వాత ఓం రౌత్ ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంకా కొలిక్కి రాలేదు.
This post was last modified on August 29, 2024 5:33 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…