బాలీవుడ్ లో హారర్ ట్రెండ్ జోరుగా ఉంది. దెయ్యాలతో కాసింత కామెడీ చేయించి రవ్వంత భయపెడితే చాలు ప్రేక్షకులు కలెక్షన్లు కురిపిస్తున్నారు. ముప్పై కోట్లతో తీసిన ముంజ్యా వంద కోట్లకు పైగా రాబడితే అసలు స్టార్లే లేని స్త్రీ 2 ఏకంగా అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. హాస్యం లేకపోయినా అజయ్ దేవగన్ సైతాన్ సైతం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని హారర్ మూవీస్ తెరకెక్కబోతున్నాయి. వాటిలో రష్మిక మందన్న ఒకటి చేస్తుండటం విశేషం. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్న ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.
వాంపైర్స్ అఫ్ విజయ నగర పేరుతో రూపొందే ఈ హారర్ డ్రామాకు ఆదిత్య సర్పోద్తర్ దర్శకత్వం వహించబోతున్నాడు. కర్ణాటకలో సుప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రం హంపీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి దాకా ఎవరూ చూపించని సరికొత్త కథలను దీని ద్వారా వెలికి తీస్తారట. హీరోగా రాజ్ కుమార్ రావు నటించబోతున్నట్టు తెలిసింది. రష్మిక పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయని అంటున్నారు. విజయ నగర సామ్రాజ్య చరిత్రతో మొదలుపెట్టి వర్తమానం దాకా విభిన్నమైన కాలమానాలు ఇందులో ఉంటాయని సమాచారం. 14వ శతాబ్దాపు నేపథ్యం కాబట్టి బడ్జెట్ గట్రా భారీగా ఉండబోతోంది.
సౌత్ లో ఎంత డిమాండ్ ఉన్నా హిందీ అవకాశాలు మాత్రం రష్మిక వదలడం లేదు. డిసెంబర్ 6 తన రెండు సినిమాలు పుష్ప 2 ది రూల్, చావా ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ధనుష్, నాగార్జునతో చేసిన కుబేర షూటింగ్ కీలక దశలో ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ ఈ ఏడాదే ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సరసన సికందర్ లో ఛాన్స్ కొట్టేయడం రష్మికకు మరో జాక్ పాట్. సందీప్ రెడ్డి వంగా యానిమల్ చేశాక శ్రీవల్లి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తెలుగు తమిళ ఛాన్సులను బాలన్స్ చేసుకుంటూనే హిందీ ఆఫర్లు వస్తే మాత్రం వీలైనంత నో చెప్పడం లేదట.
This post was last modified on August 29, 2024 3:09 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…