ఊహించని విధంగా తీవ్ర నిరాశకు గురి చేసిన మిస్టర్ బచ్చన్ విడుదల ముందు వరకు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంత హాట్ టాపిక్ అయ్యిందో చూశాం. రష్మిక మందన్న, శ్రీలీల, పూజా హెగ్డే లాగా అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు. దానికి తగ్గట్టే అమ్మడి గ్లామర్ షో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. అయితే సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి అవకాశాల మీద ప్రభావం చూపించేలా ఉంది. తనను తీసుకోవాలని భావించిన పలు నిర్మాణ సంస్థలు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలిసింది. మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే లెక్క వేరుగా ఉండేది.
రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న కాంతాలో భాగ్యశ్రీ బోర్సేనే తీసుకున్నారు. కానీ ఇదింకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న యాక్షన్ డ్రామాలో తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని అనధికార ఇన్ సైడ్ టాక్. పావు గంటకు పరిమితమయ్యే స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చారని అంటున్నారు. లేదూ ఫుల్ లెన్త్ అయితే మాత్రం అదృష్టమే. అందం ఓకే కానీ పెర్ఫార్మన్స్ పరంగానూ ఈ అమ్మాయికి పెద్దగా మార్కులు పడలేదు. పైగా స్వంతంగా డబ్బింగ్ చెప్పడం డ్యామేజీని పెంచింది. హరీష్ శంకర్ కన్నా ఎక్కువ నష్టపోయింది తనే.
ఎలాగూ హీరోయిన్ కొరత ఉంది కాబట్టి ఆ లోటుని వాడుకుని సరైన అవకాశాలు పట్టుకుని హిట్లు కొడితే భాగ్యశ్రీ బోర్సేకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే సక్సెస్, ఓపిక ఈ రెండూ ఉండాలి. మీనాక్షి చౌదరి ఈ సూత్రాన్ని పాటించే బిజీగా మారిపోయింది. ఒకప్పుడు హిట్ 2,హత్య లాంటి మీడియం సినిమాల నుంచి విజయ్, దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్ లాంటి క్రేజీ స్టార్లతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మరి భాగ్యశ్రీ బోర్సేకు ఇలాంటి యోగం దక్కాలంటే మాత్రం హిట్టు పడాలి. కాకపోతే దానికి టైం పట్టేలా ఉంది. విజయాలు ఉంటేనే పలకరించే పరిశ్రమలో కొన్నాళ్ళు ఇలాంటి ఆటుపోట్లు తప్పవు.
This post was last modified on August 28, 2024 6:21 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…