రేవు విడుదల కాబోతున్న సరిపోదా శనివారం కోసం సర్వం సిద్ధమయ్యింది. తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలోనే ప్రీమియర్లు మొదలుకాబోతున్న నేపథ్యంలో రెగ్యులర్ మార్నింగ్ షో పడేలోగానే పూర్తి టాక్ బయటికి రాబోతోంది. నాని దసరాకు సైతం చూపించని కాన్ఫిడెన్స్ ఈసారి ప్రదర్శిస్తున్నాడు. ప్రమోషన్ల భారం మొత్తం భుజాన వేసుకుని రెండు మూడు వారాలుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగడమే కాదు చివరి నిమిషంలో వచ్చే ప్రింట్ ఒత్తిళ్లను సైతం చూసుకుంటూ వివేక్ ఆత్రేయ బరువుని తగ్గించే పనిలో ఉన్నాడు. అంత నమ్మకం ఈ సినిమా మీద.
నిజానికి గురువారం రిలీజ్ అంటే ఒక రిస్క్ ఉంటుంది. వర్కింగ్ డే కాబట్టి వీకెండ్ లో కనిపించే జోరు ఈ రోజు అంతగా ఉండదు. కానీ దానికి భిన్నంగా సరిపోదా శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్పీడ్ మీదున్నాయి. బుక్ మై షోలో పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ చైన్ లేకుండానే 40 వేలకు దగ్గరలో టికెట్లు అమ్ముడుపోవడం శుభ సూచికం. మధ్యాహ్నం కొంత నెమ్మదిగా కనిపిస్తున్నా సాయంత్రం, సెకండ్ షోల బుకింగ్స్ చాలా వేగంగానే ఉన్నాయి. నాని ఈసారి బ్లాక్ బస్టర్ కొడతడనే నమ్మకం ప్రేక్షకుల్లో ముందస్తుగానే కలగడంతో ఖచ్చితంగా చూడాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
అటు హిందీ బెల్టులో చూసుకుంటే స్త్రీ 2 జోరు తగ్గిన నేపథ్యంలో సూర్యస్ సాటర్డేగా అక్కడి ఆడియన్స్ ని పలకరిస్తున్న నాని డీసెంట్ టాక్ తెచ్చుకున్నా చాలు ఉత్తరాది సైడు హిట్టు కొట్టేస్తాడు. బాగుందనే మాట బయటికి వస్తే చాలు శని ఆదివారాలు టికెట్ దొరకడం కష్టమైపోతుంది. ఎలాగూ బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమాల కరువుంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ కనీస స్థాయిలో మెప్పించడంలో విఫలమయ్యాయి. అందుకే సరిపోదా శనివారంకు గురువారం దొరికిన గోల్డెన్ ఛాన్స్ గా చెప్పుకోవాలి. నలభై కోట్లకు పైగానే బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలో దిగుతున్న నాని దాన్ని అందుకోవడం కష్టమేమి కాదు.
This post was last modified on August 28, 2024 4:28 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…