ఖుషి.. తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. పవన్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాల లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఆ చిత్రం ఉంటుంది. ఇది రీమేక్ మూవీనే అయినప్పటికీ.. తెలుగులో ఇంకా ఎంటర్టైనింగ్‌గా, ఇంకా స్టైలిష్‌గా తీర్చిదిద్ది తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా మలిచింది ఎస్.జె.సూర్య, పవన్ కళ్యాణ్ జోడీ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడంపై ఇటీవల ఓ ఆసక్తికర చర్చ జరిగింది.
సరిపోదా శనివారం ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. ఖుషికి సీక్వెల్ తీయాలని, అది కూడా పవన్ కళ్యాణ్‌తోనే చేయాలని ఇందులో కీలక పాత్ర పోషించిన సూర్యను అడిగింది. ఐతే ఖుషి ఒరిజినల్ తమిళంలో కదా తీసింది, సీక్వెల్ చేస్తే అక్కడే విజయ్‌తో చేయాలంటూ తమిళ నెటిజన్లు గొడవ చేశారు. కానీ దర్శకుడు ఎస్.జె.సూర్య మాత్రం ఖుషి సీక్వెల్‌ను తెలుగులోనే తీయాలనుకున్నాడట. స్క్రిప్టు రెడీ చేసి పవన్ కళ్యాణ్‌కు వినిపించాడట కూడా.
కానీ పవనే ఆ సినిమాను తిరస్కరించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సూర్య. ఖుషి-2 కథ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉందని సూర్య తెలిపాడు. ఈ కథ చెప్పినపుడు పవన్‌కు నచ్చిందని, నరేషన్‌ను బాగా ఎంజాయ్ చేశారని సూర్య వెల్లడించాడు. కానీ అప్పటికే తాను ప్రేమకథలు చేసే వయసు దాటిపోయానని.. కాబట్టి ఖుషి-2 చేయలేనని పవన్ తేల్చేసినట్లు చెప్పాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి నటులు వయసు పెరిగాక కూడా ప్రేమకథలు చేశారని పవన్‌కు గుర్తు చేస్తే.. తాను మాత్రం ఈ సినిమా చేయలేనంటే చేయలేను అని పవన్ చెప్పేసినట్లు సూర్య వెల్లడించాడు.
పవన్ కాదంటే నాని, రామ్ చరణ్, విజయ్ లాంటి నటులకు ఈ కథ బాగానే సూటవుతుందని.. భూమిక పాత్రకు ఇప్పుడు ప్రియాంక మోహన్ లాంటి వాళ్లు బాగానే ఉంటారని సూర్య అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ పవన్ ఒప్పుకోకపోవడం వల్లే రాలేదని ఇప్పుడు వెల్లడి కావడం పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on August 28, 2024 12:05 am
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…