తెలుగులో మళ్లీ బిగ్ బాస్ షో హంగాామా మొదలైపోయింది. కొత్త సీజన్‌ను ఇటీవలే ప్రకటించారు. అందులో పార్టిసిపెంట్లు అంటూ కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కూడా. ఆ పేర్లలో యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌ది కూడా ఉంది. లావణ్య అనే అమ్మాయితో కొన్నేళ్లు కలిసి ఉన్న రాజ్.. ఈ మధ్య విడిపోయిన నేపథ్యంలో ఆమె అతడిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు కేసులు పెట్టడం తెలిసిందే. దీని గురించి కొన్ని వారాల పాటు పెద్ద చర్చే జరిగింది.
ఇప్పుడు మీడియాలో రాజ్ పేరు బాగా నానుతుండడంతో బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తే తనకూ షోకూ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారని.. అందుకే మంచి పారితోషకంతో అతణ్ని ఈ షోలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రాజ్ దాని గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. ఐతే తన కొత్త చిత్రం ‘భలే ఉన్నాడే’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో రాజ్ బృందం దీని గురించి స్పందించింది.
మీరు బిగ్ బాస్ షోలోకి వెళ్తారట నిజమేనా అని రాజ్‌ను ప్రశ్నించగా.. ‘భలే ఉన్నాడే’ దర్శకుడు శివసాయి దీని గురించి స్పందించాడు. ‘‘ఛాన్సే లేదు. ఆయన ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరు. అన్ని రోజులు ఒకే హౌస్‌లో ఉండడం జరిగే పని కాదు’’ అని స్పష్టత ఇచ్చాడు. దీన్నే రాజ్ మాటగా కూడా భావించవచ్చేమో. ఇక లావణ్యతో గొడవ ఉన్నట్లుండి సద్దుమణిగిందేంటి అని అడిగితే.. ఈ విషయంలో తానేమీ చేయలేదని రాజ్ బదులిచ్చాడు.
వరుసగా సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలోనే లావణ్య ఇష్యూను ప్రమోషన్ కోసం తెరపైకి తెచ్చారా అని రాజ్‌ను అడిగితే.. ‘‘లేదండీ. మీరు అడిగిన ప్రశ్నను జీర్ణించుకోవాలంటే కొంత సమయం పట్టేలా ఉంది. అలా ఎవరైనా ప్రమోట్ చేసుకుంటారా’’ అని రాజ్ ఎదురు ప్రశ్న వేశాడు. తన గత చిత్రాలను సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదని.. పురుషోత్తముడ మంచి సినిమానే అని, తిరగబడరా సామీనే అచంనాలను అందుకోలేకపోయిందని.. ఇకపై తన నుంచి మంచి సినిమాలే వచ్చేలా చూసుకుంటానని రాజ్ చెప్పాడు.
This post was last modified on August 28, 2024 12:07 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…