అక్టోబర్ 10 కంగువ విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేళ రాజా ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటిగా రూపొందించిన ఈ విజువల్ గ్రాండియర్ కి ముందు ఎలాంటి పోటీ లేదు. కానీ కొద్దిరోజుల క్రితం హఠాత్తుగా రజనీకాంత్ వెట్టయాన్ అదే తేదీకి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ షాక్ అయ్యింది. ఎందుకంటే దసరా పండగకు ఇంత పెద్ద క్లాష్ సమర్ధనీయం కాదు. అందులోనూ కంగువ సోలోగా వస్తేనే ప్రయోజనం ఉంటుందని బయ్యర్లతో సహా అందరూ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కంగువనే వెనుకడుగు వేసినట్టు చెన్నై టాక్. అక్టోబర్ 10 నుంచి అదే నెల చివరిలో వెళ్లే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో ఆ లాంఛనం ఉండొచ్చని అంటున్నారు. స్టూడియోస్ గ్రీన్ సంస్థ వెట్టయాన్ నిర్మించిన లైకాతో జరిపిన సంప్రదింపులు ఆశించిన ఫలితం ఇవ్వలేదని అంతర్గత సమాచారం. రజనితో పోటీ పడే సమస్యే ఉండదని గతంలో జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో ఆన్న మాటలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ బయటికి తీస్తున్నారు. ఆ కారణంగానే వెనుకడుగు వేస్తారనే వార్త బలంగా తిరుగుతోంది.
సూర్య, దిశా పటాని జంటగా నటించిన కంగువలో బాబీ డియోల్ విలన్ గా చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత పెద్ద ఆకర్షణ కానుందో టీజర్ చూశాక అర్థమయ్యింది. రెండు భాగాలుగా రాబోతున్న కంగువ ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. సూర్య మాత్రం పోటీకే మొగ్గు చూపుతున్నాడని, ముందు అనౌన్స్ చేసింది తామే కాబట్టి వెనక్కు ఎందుకు తగ్గాలని అంటున్నాడట. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే థియేటర్లు తగ్గడం, కలెక్షన్లు పంచుకోవడం లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వెట్టయాన్ కు వదిలేద్దామని జ్ఞానవేల్ అంటున్నారట. వీలైనంత త్వరగా క్లారిటీ రావొచ్చు.
This post was last modified on August 26, 2024 1:55 am
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…